Uttarakhand Landslide: భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి.
తర్సాలి గ్రామ సమీపంలో గురువారం ఉదయం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారి 109 పూర్తిగా మూసుకుపోయింది. రెండు వైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరించటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కొండచరియలు విరిగిపడుతున్నప్పుడు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ ప్రాంతంలో ఇటీవల ఘోర ప్రమాదం జరిగింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించి ఓ యువకుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సుమారు 6 గంటల సమయంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న భాక్రా వాగును దాటేందుకు ప్రయత్నించాడు ఆ వ్యక్తి.
ఒక్కసారిగా పట్టు కోల్పోయి ప్రవాహంతోపాటే కొట్టుకుపోయాడు. పోలీసుల సమాచారం ప్రకారం ఛర్యాల్ నాయక్ గ్రామానికి చెందిన 27 ఏళ్ల పంకజ్ థాపా తన స్నేహితులతో కలిసి బన్సాయ్ అనే గ్రామానికి బైక్‌పై వెళ్లాడు. సుమారు ఆరుగంటల సమయంలో భాక్రా వాగును దాటేందుకు వారు ప్రయత్నిస్తుండగా, పంకజ్ వాగులో పడిపోయాడు. స్నేహితులు ఎంత ప్రయాత్నించినా అతన్ని కాపాడలేకపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మూడు కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ యువకుడి ఆచూకీ లభించలేదు.
Also Read: Hijab Ban Row: అవన్నీ వద్దు, పాయింటుకు రండి- సహనం కోల్పోతున్నాం: హిజాబ్ వాదనలపై సుప్రీం