Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. కొంతమంది కబడ్డీ ప్లేయర్లకు బాత్రూంలో భోజనాలు పెడుతోన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
మీరట్ సహరాన్‌పుర్‌లోని స్పోర్ట్స్ స్టేడియంలో టాయిలెట్ నేలపై పెద్ద ప్లేట్‌లో వండిన అన్నాన్ని ఉంచిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.
సహరాన్‌పుర్ జిల్లాలో మూడు రోజుల రాష్ట్ర స్థాయి U-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. ఇందులో పాల్గొంటున్న దాదాపు 200 మంది క్రీడాకారిణులకు ఇదే భోజనాన్ని అందించారు.ఆ టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులు ఈ వివరాలు వెల్లడించారు.
ఖండించిన అధికారులు
ఈ ఆరోపణలను సహరాన్‌పుర్ క్రీడా అధికారి అనిమేష్ సక్సేనా ఖండించారు. ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని ఆయన అన్నారు.
వీడియోలో
అయితే వీడియోలో మాత్రం పాత్రలో వండిన అన్నాన్ని ఒక పెద్ద ప్లేట్‌లో తీసి, దాన్ని గేటు దగ్గర టాయిలెట్ ఫ్లోర్‌లో ఉంచారు. అన్నం ప్లేట్ పక్కన నేలపై కాగితంపై మిగిలిపోయిన పూరీలు ఉన్నాయి. ఆ తర్వాత శుక్రవారం మధ్యాహ్న భోజనంలో ఆటగాళ్లకు ఇదే అన్నం వడ్డించారు.
కొంతమంది ఆటగాళ్లు స్టేడియం అధికారికి ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ఈ సమాచారం క్రీడా అధికారి అనిమేష్ సక్సేనాకు తెలిసింది. దీంతో వంటవాళ్లను సక్సేనా మందలించినట్లు తెలుస్తోంది.
విమర్శలు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యోగి సర్కార్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్, సమాజ్‌వాదీ సహా పలు విపక్ష పార్టీల నేతలు ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. కబడ్డీ ప్లేయర్లకు నాణ్యమైన ఆహారాన్ని కూడా అందించలేక పోతున్నారని విమర్శిస్తున్నారు.
Also Read: Jodhpur News: కన్నతండ్రిని కర్రతో చావబాదిన కుమారుడు- వైరల్ వీడియో!
Also Read: Delhi Crime: కోడలు పాడు పని! అత్తామామల న్యూడ్ వీడియోలు రికార్డ్ - వాటితో కన్నింగ్ స్కెచ్!