Jodhpur News: కన్నతండ్రిని కర్రతో చావబాదిన కుమారుడు- వైరల్ వీడియో!

ABP Desam   |  Murali Krishna   |  20 Sep 2022 11:56 AM (IST)

Jodhpur News: వృద్ధ తండ్రిని కుమారుడు చావబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(Image Source: Twitter)

Jodhpur News: రాజస్థాన్‌లో దారుణ ఘటన జరిగింది. జోధ్‌పుర్‌ నగరంలోని ఓ కుమారుడు ఎలాంటి కనికరం లేకుండా వృద్ధుడైన కన్నతండ్రిని కర్రతో కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదీ జరిగింది

జోధ్‌పుర్‌ నగరానికి చెందిన తండ్రీ కొడుకు మధ్య ఏదో వివాదం వచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కుమారుడు వీధిలో ఉన్న కర్రను తీసుకొని కన్నతండ్రిని కనికరం లేకుండా కొట్టాడు. వృద్ధుడైన తండ్రి బాధతో విలపిస్తున్నా వదలకుండా కుమారుడు చావబాదాడు. చుట్టుపక్కల వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా కుమారుడు వదల్లేదు.

అయినా కుమారుడు ఇరుగుపొరుగు వారికి దూరంగా వెళ్లి తన వృద్ధ తండ్రిని మళ్లీ  కొట్టాడు. తండ్రిని కుమారుడు కొడుతున్న ఈ వీడియోను అక్కడున్న వారు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అరెస్ట్

ఈ ఘటన జోధ్‌పుర్‌ నగరంలోని రతనాడ పోలీస్‌స్టేషన్ స్టేషన్ పరిధిలో జరిగింది. వీడియోలోని యువకుడు తన తండ్రిపై దాడి చేయడం ఇదే మొదటిసారి కాదని పోలీసులు చెప్పారు.

ఈ ఘటనకు ఒకరోజు ముందు ఆ వ్యక్తి తన తండ్రితో అనుచితంగా ప్రవర్తించినట్లు మాకు ఫిర్యాదు అందింది. తండ్రిని కొట్టిన నిందితుడిని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 151 కింద అరెస్టు చేశాం. ఆయనకు కౌన్సిలింగ్ ఇస్తాం. కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు చేస్తున్నాం.                          - జోధ్‌పుర్ పోలీసులు 

మరో ఘటన

చిన్నతనం నుంచి అల్లారుముద్దుగా పెంచిన తండ్రిపై కనికరం లేకుండా కుమారులు దాడి చేస్తోన్న ఘటనలు కొత్తేం కాదు. గతంలో  మద్యానికి బానిసైన ఓ వ్యక్తి కన్న తండ్రిపై కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. మద్యం తాగొద్దని మందలించాడనే కోపంతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు కుమారుడు. చెడు అలవాట్లకు బానిస కావద్దని వారించిన తండ్రినే చంపాలని యత్నించాడు.

Also Read: Uttar Pradesh News: బాత్రూమ్‌లో భోజనాలు- కబడ్డీ ప్లేయర్లకు ఘోర అవమానం!

Also Read: Delhi Crime: కోడలు పాడు పని! అత్తామామల న్యూడ్ వీడియోలు రికార్డ్ - వాటితో కన్నింగ్ స్కెచ్!

Published at: 20 Sep 2022 11:20 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.