Delhi Daughter In Law News: ఢిల్లీలో ఓ కోడలు మెట్టినింట్లో చేసిన పని సమాజం తలదించుకునేలా ఉంది. ఈ సీరియస్ చర్య తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ కోడలు తన అత్తామామలు పడుకొనే బెడ్ రూంలో సీసీటీవీ కెమెరాలు అమర్చి వారి న్యూడ్ వీడియోలు చిత్రీకరించింది. వాటితో ఏకంగా భర్తతోనే బెదిరింపులకు దిగింది. తాడో పేడో తేల్చుకోవాలని భర్తకు సవాలు విసిరింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో జరిగింది.


జాతీయ వార్తా పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో భార్యాభర్తలు, అత్తామామలు కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలకు మధ్య గొడవ కావడంతో వారు వేరు వేరు గదుల్లోనే ఉంటున్నారు. మరోవైపు, భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఆ విషయం భర్తకు ఆలస్యంగా తెలిసింది. తన గుట్టు భర్తకు తెలిసిందన్న విషయం తెలుసుకున్న భార్య ఏకంగా తన ఇంట్లో నుంచి రూ.2 కోట్ల విలువైన నగలు, రూ.1.5 కోట్ల నగదుతో పరారైంది.


భార్య చేసిన అరాచకంపై భర్త ఢిల్లీ లక్ష్మీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాని ప్రకారం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మహిళ తన కాలేజీ స్నేహితుడితో కలిసి గత 4 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతోందని పోలీసులు తేల్చారు.


అయితే, పరాయి వ్యక్తితో వెళ్లిపోయిన భార్య, తన భర్తకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగింది. తాను తన అత్తామామల (భర్త తల్లిదండ్రులు) బెడ్ రూంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశానని, వారు నగ్నంగా ఉన్న వీడియోలు తన దగ్గర ఉన్నాయని బెదిరించింది. కేసు వాపసు తీసుకోకపోతే ఆ నగ్న వీడియోలను ఇంటర్నెట్ లో పెట్టి వైరల్ చేస్తానని బెదిరించింది. దీంతో మరోసారి భర్త పోలీసులను ఆశ్రయించాడు.


బాలికపై రోజూ 10కి పైగా అఘాయిత్యం?
తాజాగా గురుగ్రామ్ కు చెందిన ఓ 14 ఏళ్ల బాలికపై జరుగుతున్న అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఓ స్పా సెంటర్ లో ఉద్యోగం కోసం చేస్తున్న బాలికపై రోజూ అత్యాచారం జరుగుతున్నట్లుగా గుర్తించారు. స్పా సెంటర్ నిర్వహకుల మీద అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కొన్ని రోజులు స్పా సెంటర్ మీద నిఘా వేసి చివరికి రాత్రి సమయంలో దాడి చేశారు. ఆ బాలికను విచారణ చేయగా, తనను ప్రతిరోజు 15 మంది అనుభవిస్తున్నారని, ఇంత జరగడానికి కారణం పూజా అనే మహిళ, ఆమె బంధువు కారణం అని మైనర్ అమ్మాయి చెప్పింది. తన మీద మొదటి రోజు అత్యాచారం చేసే సమయంలో వీడియో తీశారని, తాను ఉద్యోగం మానేస్తాను అని చెప్పడంతో తన మీద అత్యాచారం చేసే సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారని బాధితురాలు వాపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు స్పా సెంటర్ నిర్వహకుడిని అరెస్టు చేశారు.