Stocks to watch today, 20 September 2022: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 124 పాయింట్లు లేదా 0.70 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,748 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


అదానీ ఎంటర్‌ప్రైజెస్: అదానీ గ్రూప్‌కు చెందిన ఈ ఫ్లాగ్‌షిప్ కంపెనీ, ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన రూ.10 లక్షల ముఖ విలువ కలిగిన 1,000 నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను కేటాయించింది, రూ.100 కోట్లను సమీకరించింది. వీటిని BSE హోల్‌సేల్ డెట్ మార్కెట్ సెగ్మెంట్‌లో లిస్ట్‌ చేస్తారు.


వెల్‌స్పన్‌ కార్ప్‌: ఈ మెటల్ ప్లేయర్, నౌయాన్ షిప్‌యార్డ్ ‍‌(Nauyaan Shipyard) కంపెనీని కొనుగోలు చేసింది. దీని ద్వారా ఓడల నిర్మాణం, షిప్పర్స్‌, షిప్ ఓనర్స్‌, రిపేర్లు, రీ ఫిట్టర్లు, ఫ్యాబ్రికేటర్స్‌ చేపడుతుంది.


నాట్కో ఫార్మా: క్రిమి సంహారక మందు క్లోరాంట్రానిలిప్రోల్ (CTPR), దాని ఫార్ములేషన్లను లాంచ్‌ చేయడానికి కోర్టు నుంచి అనుమతి పొందినట్లు ఈ ఔషధ సంస్థ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించకుండా, ఈ పురుగు మందును లాంచ్‌ చేసుకోవచ్చని దిల్లీ హైకోర్టు నుంచి ఆర్డర్‌ అందుకుంది.


కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS): ఈ హాస్పిటల్‌కు చైన్‌కు చెందిన 12.10 లక్షల షేర్లు లేదా 1.5 శాతం వాటాను, ఒక్కో షేరుకు సగటున రూ.1,250 చొప్పున జనరల్ అట్లాంటిక్ సింగపూర్ (General Atlantic Singapore) కంపెనీ అమ్మింది. మొత్తం అమ్మకం విలువ రూ.151.25 కోట్లు. బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అదే ధరతో షేర్లను కైవసం చేసుకుంది.


సియట్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన, రూ.150 కోట్ల విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను (NCDs) జారీ చేసినట్లు ఈ టైర్ల మాన్యుఫాక్చరిగ్‌ కంపెనీ తెలిపింది.


IFCI: ప్రాధాన్యత ప్రాతిపదికన భారత ప్రభుత్వానికి ఈక్విటీ షేర్ల జారీని పరిశీలించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 27న సమావేశమవుతుంది. ఇది ప్రభుత్వ యాజమాన్యంలో సంస్థ, ఆర్థిక సేవల వ్యాపారంలో ఉంది. బోర్డు డైరెక్టర్ల నిర్ణయానికి వాటాదారులు, స్టాక్ ఎక్స్ఛేంజీల ఆమోదం కూడా అవసరం.


హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌: రూ.400 కోట్ల వరకు రైట్స్‌ ఇష్యూ కోసం డైరెక్టర్ల బోర్డు నుంచి ఈ పాల ఉత్పత్తుల ప్లేయర్ ఆమోదం పొందింది.


TV18 బ్రాడ్‌కాస్ట్: జియో సినిమా ఓటీటీ, వయాకామ్‌18 విలీనానికి ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ అయిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) అనుమతించింది. తద్వారా, వయాకామ్‌18కు జియో సినిమా ఓటీటీ యాప్‌ బదిలీ అవుతుంది.


ఫ్యూచర్ సప్లై చెయిన్స్: అవసరమైన అనుమతులను పొందడంలో జాప్యం కారణంగా, ఆస్తులను విక్రయించే ప్రణాళికలను ఈ కంపెనీ విరమించుకుంది. ప్రతిపాదనను రద్దు చేసే తీర్మానాన్ని ఫ్యూచర్ సప్లై చెయిన్స్ ఆమోదించింది.


బాంబే డైయింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ: ఈ నెల 22న ఈ కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం అవుతుంది. ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ ప్రతిపాదనను బోర్డ్‌ పరిశీలిస్తుందని ఈ టెక్స్‌టైల్ కంపెనీ తెలిపింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.