గతంలో ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా ఉన్న కరీంనగర్ లో ఇంకా సానుభూతిపరులు ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు NIA అధికారులు. ఇప్పటికే జిల్లాలో పూర్తిస్థాయిలో నిఘా పెంచి మరో ముగ్గురి నుండి నలుగురిని అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ముందుగా ఇక్కడ అరెస్ట్ చేసిన వారి నుండి పూర్తి సమాచారం, ఆధారాలు రాబట్టిన తర్వాతే మళ్లీ తనిఖీలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


ఇదీ జరిగింది
కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందాలు ఆదివారం రోజు తనిఖీలు నిర్వహించాయి. దాంతో కలకలం రేగింది. హైదరాబాద్ నుండి వచ్చిన నాలుగు బృందాలు ఉదయాన్నే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. స్థానిక పోలీసుల సహకారంతో ఏడు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి పలు పత్రాలు స్వాధీన పర్చుకున్నారు. జగిత్యాల ఉస్మాన్ పురకు చెందిన ఇర్ఫాన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించి, అతను కరీంనగర్ హుస్సేన్ పురలోని బంధువుల ఇంట్లో ఉన్న విషయం తెలిసి అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ నగర్ లో ఎం.డి. ఉస్మాన్ ఇంటికి వెళ్లి తనిఖీలు చేశారు. ఉస్మాన్ ను అంతకుముందే షామీర్ పేట లో అదుపులోకి తీసుకున్నారు. టవర్ సర్కిల్లోని ఒక మందుల దుకాణం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించే యజమాని రావడంతో దుకాణాలు తనిఖీలు నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఈ విషయంపై ఆరా తీశారు. 


జిల్లా కేంద్రంలో ఏడు గంటల పాటు సోదాలు నిర్వహించడంతో ఏం జరుగుతుందనే ఆత్రుత నెలకొంది. జగిత్యాల జిల్లా కేంద్రంగా నిషేధిత పాపులర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కార్యకలాపాలు గతంలో సాగాయి. ఉగ్రవాద లింకులు ఉన్నాయని అనుమానంతో గత జూలైలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 141/2022 నెంబర్ ద్వారా పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. మరింత లోతుగా విచారణ జరిపి ఆగస్టు 26న మరో కేసు నమోదు చేశారు. మరింత లోతుగా విచారణ జరిపి ఆగస్టు 26న మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 


ఇందులో భాగంగా ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే సమయంలో ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. జగిత్యాలలో ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పలు పత్రాలు, ఫోన్ లు స్వాధీన చేసుకున్నారు. నోటీసులు జారీ చేసి తమ కార్యాలయానికి రావలసిందిగా సూచించారు. పీఎఫ్ఐ కోడ్ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మతం ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వం పెంచడంతోపాటు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని ఎన్ఐఏ గుర్తించింది. నిజామాబాద్ లింకు ఆధారంగా జగిత్యాలలో సోదాలు నిర్వహించి ఆరోపణలు ఉన్న వ్యక్తులు అందుబాటులో లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. ఖర్చుల కోసం విదేశాల నుంచి నిధులు వస్తున్నాయన్న డౌట్ తో బ్యాంకు ఖాతా బుక్స్ ని తీసుకెళ్లారు.


జగిత్యాలలో ఇదివరకే పీఎఫ్ఐ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.100 మంది కార్యకర్తలను అందులో పదిహేను మంది కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2002 లోనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆజంఘోరీ తాజాగా జగిత్యాలలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. జగిత్యాల కేంద్రంగా ఉంటూ నిజామాబాద్, నిర్మల్, కోరుట్ల, మెట్ పల్లి ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేలడంతో అప్పటి నిజామాబాద్ ఎస్పీ రవిశంకర్ ప్రత్యేక దృష్టి సారించారు. రెండు సినిమా థియేటర్ లలో బాంబు పేలుళ్ల సంఘటన నేపథ్యంలో లోతుగా దర్యాప్తు జరపగా ఒకరి పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి శిథిలాలలో రాజ్యం గురించి ప్రస్తుతం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ రూపంలో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు ఎన్ఐఏ ఎంతో తీవ్రంగా పరిగణిస్తోంది.