గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu September 20 Today Episode 560)
వసుధార-రిషి ఇద్దరూ బయటకు వెళతారు. రిషి సార్ తో మాట్లాడి ఎలాగైనా మనస్పర్ధలు తొలగించుకోవాలని మనసులో అనుకుంటుంది వసుధార. మాట్లాడడం లేదేంటి అనుకుంటాడు రిషి. ఆ తర్వాత కారు ఆపి దిగమంటాడు. ప్రేమికుల మధ్య దాపరికాలు ఉండకూడదన్న రిషితో..దాపరికాలు అన్నవి మబ్బుల్లాంటివి వస్తాయి పోతాయి అంటుంది. నువ్వు నన్ను రిషి గా ప్రేమించావా? లేక జగతి మేడం కొడుకుగా ప్రేమించావా అంటే...నేను ప్రేమించిన వ్యక్తి జగతి మేడం కొడుకు కాదా సార్ అని వసు అంటుంది. నేను నిన్ను ప్రశ్న అడిగితే నువ్వు తిరిగి నన్ను ఇంకో ప్రశ్న అడుగుతున్నావ్ వసుధార అంటాడు రిషి. అసలేం జరిగిందంటే అని చెప్పేందుకు వసుధార ఎంత ప్రయత్నించినా రిషి అస్సలు వినిపించుకోడు. ఆ తర్వాత ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోతారు...ఈ రోజు ( మంగళవారం) ఎపిసోడ్ లో...
వసుధార: రిషి సార్ జగతి మేడంని అమ్మా అని పిలిస్తే ఎంత బావుంటుందో
రిషి: వసుధార నన్ను ప్రేమిస్తే నా మనసు అర్థం చేసుకోవాలి కదా
వసుధార:మీ మనసు మీకన్నా బాగా నేనే అర్థం చేసుకోగలను
రిషి: నేను ఎప్పటికీ మారను
వసుధార:జగతి మేడం విషయంలో మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని వదులుకోను
Also Read: కథని మలుపుతిప్పనున్న మోనిత కొడుకు ఆనంద్, దీప చెప్పింది వినగానే కళ్లు తిరిగిపడిపోయిన కార్తీక్
ఇక జరిగిన కథ విషయానికొస్తే..
రిషి అన్న మాటలు తలుచుకుని బాధపడుతుంటాడు మహేంద్ర. నేను ఏమైనా తప్పు చేశాన జగతి,నేను కోరుకున్న దాంట్లో స్వార్థం ఏమైనా ఉన్నదా? దానికి రిషి నేను ఏదో జరగకూడని తప్పు చేసినట్టు, జీవితంలో క్షమించరానంత తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాడు, నిజం చెప్పే అవకాశం కూడా రిషి నాకు ఇవ్వలేదు అని బాధపడతాడు.
జగతి:ప్రతీసారి మాటలతో ఎదుటి వాళ్ళను సమాధానం పరచలేం మహేంద్రయ.. బాధలో ఓదార్పుగా ఉండాల్సింది మనుషులు కాదు కన్నీళ్లు. ఎంత ఏడిస్తే అంత బాధ తగ్గుతుంది,మనసు బరువు దించేసుకో అని చెబుతుంది.
ఇంతలో గౌతమ్,ధరణి వచ్చి వసుధార కనిపించడం లేదు, ఇల్లంతా వెతికాం అని చెబుతారు. ఎవరికి చెప్పకుండా వసు బయటికి వెళ్ళదు నాతో చెప్పకుండా అసలు వెళ్ళదు అని జగతి అంటుంది. ఒకసారి రిషి ని అడుగుదామా అనుకుని గౌతమ్ ని పంపిస్తారు. గౌతమ్ వెళ్లి వసు కనిపించడం లేదని చెప్పినా రిషిలో స్పందన ఉండదు. అందరూ ఉన్నారు కదా వెళ్లి వెతకండి అంటాడు.
వసుధార..లైట్ బెలూన్లని గాల్లో ఎగరడానికి తయారుచేస్తుంది. అంతలో రిషి అక్కడికి వస్తాడు. గతంలో రిషి,వసు ఇలాగే ఆ లైట్ బెలూన్ ని గాల్లోకి పంపుతూ, ఇలా మనం చేసి మనసులో ఎవరి గురించి అయినా మంచి కోరుకుంటే అది నెరవేరుతుందట అని ఒకసారి వసు చెప్పిన మాటలు గుర్తొస్తాయి రిషికి. అదే సమయంలో వసు, నేను అనుకున్న పని జరగాలి. రిషి సార్, జగతి మేడంని అమ్మ అని పిలవాలి అని అంటుంది. ఆ మాటవిని కోప్పడిన రిషి..వసు దగ్గరకు వెళతాడు కానీ ముఖం కూడా చూడడు. ముఖం కూడా చూపించలేనంత తప్పు ఏం చేశాను సర్ అని అడిగినా..తప్పులు గురించి ఇప్పుడు మాట్లాడొద్దు..నీ గురించి అంతా కంగారుపడుతున్నారు కిందకు వెళ్లు అని చెబుతాడు.
Also Read: వసుధారకు చాలా చాలా ద గ్గ ర గా రిషి, ఈగోమాస్టర్లో మరో యాంగిల్!
ఇక ఇంట్లోంచి వెళ్లిపోతున్న వసుధారని ఆపి మరీ దేవయాని మరింత అవమానిస్తుంది. పరాయివాళ్లైనా కానీ మర్యాదలు చేసి పంపిస్తాం అని చెప్పి...సూటిపోటి మాటలాడుతూ జగతితో బట్టలు పెట్టిస్తుంది. ఆ తర్వాత వసుధార...రిషితో కలసి బయటకు వెళుతుంది. అక్కడ కూడా రిషి మాట్లాడుతాడు కానీ వసుధార చెప్పింది వినిపించుకోడు...గురుదక్షిణ ఒప్పందం నీకు నా డాడీకి మధ్య జరిగింది దానికి నేను నిన్ను ప్రేమించడానికి ఎటువంటి సంబంధం లేదు. ఒక మనిషిని ప్రేమించడానికి ఒప్పందాలు, షరతులు పెట్టావు అనే బాధ తప్ప నాకు ఇంకే బాధ లేదు అని అంటాడు రిషి. అసలు జరిగిందేంటంటే అని వసు చెప్పేలోగా రిషి, వసుని ఆపి ఇంక నాకేం చెప్పద్దు వసుధార. అయినా నువ్వు డాడ్ తో చేసిన ఒప్పందం నాకేం నచ్చలేదు అంటాడు. దీనికి కొనసాగింపే పైన పోస్ట్ చేసిన ప్రోమో....