గుప్పెడంత మనసు  గురువారం ఎపిసోడ్  ( Guppedantha Manasu September 15 Today Episode 556)


వసుధార సెలెక్ట్ చేసిన డ్రెస్ బాగోపోవడంతో ఆ డ్రెస్సుపై కావాలనే కాఫీ పోసేస్తుంది వసుధార. అప్పుడు ఆ డ్రెస్ మార్చుకునేందుకు వెళ్లిన రిషి...తల్లిదండ్రులు జగతి-మహేంద్ర సరదాగా మాట్లాడుకోవడం చూసి మురిసిపోతాడు. రిషితో పాటూ మహేంద్ర వెళతాడు. ఎప్పటిలా ఓ మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకుని వెసుకుంటాడు రిషి. కాసేపయ్యాక వస్తానని తండ్రికి కిందకు పంపిస్తాడు రిషి. మరోవైపు వసుధార...రిషి ఇచ్చిన చీర కట్టుకుని అద్దంలో చూసుకుని మురిసిపోతుంటుంది.  రిషి సర్ చీరలు కట్టుకోవద్దని కూడా చెప్పారు. ఇప్పుడు ఆయనే నాకు చీర ఇచ్చారు అని కట్టుకుంటుంది. ఈ రోజు మీతో కాంప్లిమెంట్స్ తీసుకుని తీరుతాను రిషి సార్ అనుకుంటుంది..ఇంతలో అద్దంలో వెనుకనుంచి రిషి కనిపిస్తాడు...


రిషిని చూసి ఉలిక్కిపడి వెనక్కు తిరుగుతుంది వసుధార. కళ్లు కళ్లు కలుస్తాయి..ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుంటూ ఉండిపోతారు. తనిచ్చిన చీరలో వసుని చూసి మైమరిచిన రిషి వసుధారకి దగ్గరగా వెళతాడు... వసుధారా ప్రపంచంలో ఇంత దగ్గరగా ఎవర్నీ భావించలేదు.. ఇంతకన్నా ఎవ్వర్నీ ప్రేమించనేమో కూడా అంటాడు.. వసుధార రిషి కళ్లలోకి చూస్తూ ఉండిపోతుంది... 






Also Read:  దీపతో ఫోన్లో మాట్లాడిన శౌర్య, ఆనంద్ కోసం ఓ వైపు మోనిత-మరోవైపు హిమ ఆరాటం!
జరిగిన కథ
మహేంద్ర-జగతి: నాకు ఇది ఇంకా నమ్మశక్యంగా లేదు జగతి. నువ్వు, నేను, రిషి కలిసి ఒక దగ్గర ఉండడం అంటే అది నా జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయ. నిన్ను ఇంట్లోకి రానివ్వడం, నిన్ను సార్ అని పిలవద్దు అనడం ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఇంక రిషి నిన్ను అమ్మా అని అప్పుడు పిలుస్తాడో వేచి చూస్తూ ఉన్నాను. ఒకప్పుడు వసుదార దగ్గర నేను మాట తీసుకున్నాను, నిన్ను రిషిని కలపమని వసుధార ఆఖరికి అది చేసింది. ఇంక వసు మన ఇంటికి కోడలుగా రావడం మాత్రమే మిగిలి ఉంది. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను మహేంద్ర అంటుంది జగతి. 


Also Read: వసు ఎందుకలా చేసిందో అర్థంకాని అయోమయంలో రిషి, షాక్ అయిన దేవయాని, గౌతమ్!


ఆ తర్వాత రిషి కోటుపై వసుధార కాఫీ పోసెయ్యడం  చూసి దేవయాని ఫైర్ అవుతుంది. ప్రతి పనిలోనూ తలదూర్చుతావెందుకని కోప్పడుతుంది. స్పందించిన రిషి..పర్వాలేదు పెద్దమ్మా వెళ్లి డ్రెస్సు మార్చుకుంటానని చెప్పి లోపలకు వెళతాడు. జగతి-మహేంద్ర ఆనందంగా మాట్లాడుకుంటూ కిందకు దిగి వస్తుంటారు. అది చూసి రిషి మురిసిపోతాడు.  రిషితో పాటూ మహేంద్ర లోపలకు వెళతాడు.. ఆతర్వాత జగతికి వసుధార ఎదురుపడుతుంది. వసు చేతిలో కాఫీ కప్ చూసిన జగతి..అది నీ పనేనా అని అడుగుతుంది. అవును మేడం నేను సార్ కి షర్టు సెలెక్ట్ చేశాను అది బాలేదు, కానీ సర్ నాకోసం  వేసుకున్నారు..అందుకే నా తప్పును నేనే సరిచేసుకున్నా అని రిప్లై ఇస్తుంది.ఆ తర్వాత మరో డ్రెస్ వేసుకున్న రిషి.. మహేంద్రని కిందకు పంపించేసి వసురూమ్ కి వెళతాడు... బుధవారం ఎపిసోడ్ ఇక్కడ ముగిసింది... పైన పోస్ట్ చేసిన ప్రోమో ఈ రోజు(గురువారం) ఎపిసోడ్ ది....