గుప్పెడంత మనసు  బుధవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu September 14 Today Episode 555)

Continues below advertisement


తనకి చీర తీసుకొచ్చి ఇచ్చిన రిషి కోసం డ్రెస్ సెలెక్ట్ చేయాలి అనుకుంటుంది వసుధార. 
వసుధార: ఈ కాంబినేషన్ బావుంటుంది వేసుకోండి సార్ రిషి: ఇంత అభిమానంగా సెలెక్ట్ చేస్తోంది అని వేసుకుని లోపల నుంచి బయటకు వస్తాడు
ఫణీంద్ర: హేయ్ రిషి నీ డ్రెస్ సెన్స్ చాలా బావుంటుంది కదా ఇదేంటి ఇలా ఉంది...
రిషి ఏం సమాధానం చెప్పలేక వసుధార వైపు చూస్తాడు.. నేను బలవంతంగా ఆ డ్రెస్ వేయించానా అని బాధపడుతుంది వసుధార. దీంతో ఎలాగైనా రిషితో ఆ డ్రెస్ విప్పించేయాలని ప్లాన్ చేసుకుని..కాఫీ ఒలకబోసేస్తుంది.. ఎందుకిలా చేసిందో అర్థం కాక రిషి షాక్ లో చూస్తుంటాడు...


బుధవారం రాత్రి ప్లే అవబోయే ఎపిసోడ్ ప్రోమో ఇక్కడ చూడొచ్చు...






ఇక జరిగిన కథ విషయానికొస్తే...


పెళ్లిరోజు సందర్భంగా ఆమె నగలు ఆమెకు గిఫ్ట్ గా ఇవ్వాలని చెబుతాడు దేవయాని భర్త ఫణీంద్ర. అందుకు ఇష్టంలేని దేవయాని ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు ఇస్తే అధికారం తన చేతిలోకి వచ్చినట్లుగా ఫీల్ అవుతుంది అని అనుకుంటుంది. కానీ ఫణీంద్ర ఇవ్వమని అనటంతో సరే అంటుంది దేవయాని. అప్పుడే రిషి అక్కడకు వచ్చి ఈ నగలు ఎవరివి అని అడుగుతాడు. ( గతంలో మీ అమ్మ డబ్బు-నగలు తీసుకుని నిన్ను వదిలేసి వెళ్లిపోయిందని దేవయాని అబద్ధం చెప్పిన విషయం గుర్తుచేసుకుంటంది). ఇప్పుడు ఈ నగలు జగతివే అని తెలిస్తే రిషికి తాను అబద్ధం చెప్పినట్టు తెలిసిపోతుందని భావిస్తుంది దేవయాని. అసలు విషయం చెప్పకుండా.. అవి తన నగలే అని జగతికి బహుమతిగా ఇస్తున్నాను అని అబద్ధం చెబుతుంది. నీది ఎంత పెద్ద మనసు పెద్దమ్మా అని పొగుడుతాడు రిషి. ఆ తర్వాత బయటకు వచ్చి గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తుచేసుకుంటాడు. ఏమైందరా అని అడిగిన గౌతమ్ తో మూడీగా మాట్లాడతాడు రిషి. అయితే పెళ్లిరోజు వేడుకలో నువ్వు సంతోషంగా కనిపించాలని చెబుతాడు గౌతమ్..


Also Read:  మన బాబు దొరికాడంటూ కార్తీక్ ని కట్టిపడేసిన మోనిత, వంటలక్కని మళ్లీ అనుమానించిన డాక్టర్ బాబు


ఆ తర్వాత పెళ్లిరోజు పంక్షన్ కి ఏ డ్రెస్ వేసుకోవాలా అనే ఆలోచనలో పడుతుంది వసుధార. గతంలో ఎప్పుడూ ఈ ప్రాబ్లెమ్ రాలేదు కానీ ..రిషి సార్ కి అందంగా కనిపించాలనే కదా ఈ తాపత్రయం అని మనసులో అనుకుంటుంది. అప్పుడు వచ్చిన హీరోగారు..అమ్మాయిగారికి చీర తీసుకొచ్చి ఇస్తాడు. అప్పట్లో చీర కట్టుకుని ఇబ్బంది పడుతున్న వసుధారపై కోప్పడతాడు రిషి. ఆ సంఘటన గుర్తుచేసుకున్న వసుధార..ఇప్పుడెందుకు సార్ ఇది అంటుంది. నీకు బావుంటుంది కట్టుకో అంటాడు రిషి... థ్యాంక్స్ చెబుతుంది వసుధార. 


Also Read: జగతి-మహేంద్ర పెళ్లిరోజు సందర్భంగా వసుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రిషి


మరోవైపు ఇక తప్పదు అనుకుని జగతి దగ్గరకు వెళ్లి ఆ నగలు ఇస్తుంది దేవయాని. లేని ప్రేమ నటించిన దేవయానికి స్వీట్ గా కౌంటర్స్ వేసి ఆ నగలు తీసుకుని సంతోషపడుతుంది జగతి. మంగళవారం ఎపిసోడ్ ఇక్కడ ముగిసింది..