ఆదిత్య ఖుషిక్ గిఫ్ట్ ఇస్తుంటే నేను కూడా నీ కోసం తీసుకున్నాను నువ్వు ఆ గిఫ్ట్ తీసుకుంటేనే నేను ఇది తీసుకుంటాను అని అంటుంది. ఇవ్వు తీసుకుంటా అని ఆదిత్య అనేసరికి ఖుషి వెళ్ళి యష్ చేతిలోని బాక్స్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇది మీ నాన్న సెలెక్ట్ చేశారు కదా అని ఆదిత్య అంటే నువ్వు కొన్నది కూడా మీ అమ్మ సెలెక్ట్ చేసింది కదా అని ఖుషి అంటుంది. నేనే సెలెక్ట్ చేశాను కాకపోతే నాన్నతో ఇప్పించాలని చూశాను నువ్వు తీసుకోలేదని ఖుషి చాలా తెలివిగా మాట్లాడుతుంది. నీ కోసం నేను తీసుకున్నా నా కోసం నువ్వు తీసుకోవా అని అడుగుతుంది. నీ కోసం నేను ఏమైనా చేస్తాను ఖుషి అని యష్ కొన్న డ్రెస్ తీసుకుంటాడు. అది చూసి యష్, వేద చాలా సంతోషిస్తారు.
యష్ పరిగెత్తుకుంటూ వచ్చి ఖుషిని ఎత్తుకుని ప్రేమగా దగ్గరకి తీసుకుని ముద్దాడతాడు. చాలా థాంక్స్ తల్లి ఈ నాన్న ప్రేమని బాగా అర్థం చేసుకున్నావ్ అని యష్ చాలా సంతోషంగా ఉంటాడు. సులోచన మోయలేనంత బరువు ఉన్న బ్యాగ్స్ ఇంటికి తీసుకొస్తుంటే శర్మ వెళ్ళి ఎదురు తీసుకుంటాడు. వాటిని తన చేతుల్లోకి తీసుకుని ఇవి ఏంటి ఇంత తేలికగా ఉంటే అలా బరువుగా ఉన్నట్టు చెప్పావ్ అని అడుగుతాడు. ఇంట్లో అందరూ నవ్వుతారు. అసలేం జరుగుతుందని శర్మ అడుగుతాడు. అప్పుడే చిత్ర, వైభవ్ వస్తారు. వైభవ్ చిత్రకి కాబోయే భర్త అని చెప్పడం అంతా అబద్ధం అని వేద చెప్తుంది. ఇదంతా వసంత్ మనసులో చిత్ర మీద దాగి ఉన్న ప్రేమని బయటకి తీసుకురావడానికి చేస్తున్న నాటకం అని చెప్తారు.
Also Read: సామ్రాట్ ముందే నందుని అవమానించిన అనసూయ- పండగ సంబరాల్లో గొడవపడిన ప్రేమ్, శ్రుతి
ఇదంతా వర్క్ అవుట్ అవ్వని డ్రామాలా అనిపిస్తుంది. నాకోసం మీరంతా ఆలోచిస్తున్నారు కానీ రేపటితో రియాక్ట్ అవ్వాలసిన వాళ్ళు ఎ ఆలోచన బాధ లేకుండా కేర్ లెస్ గా ఉన్నాడు. వసంత్ నిధితో ఎంగేజ్మెంట్ కి ఒప్పుకున్నాడు. షాపింగ్ మాల్ లో కూడా నిధితో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడు అని చిత్ర చాలా బాధపడుతోంది. వసంత్ కి నీమీద ఎంత ప్రేమ ఉందో యష్ మీద అంతే గౌరవం ఉంది. అందుకే ఏ నిర్ణయం తీసుకోలేక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, వసంత్ మౌనం నీకు చేతకాని తనంలా కనిపించడంలో తప్పులేదు కానీ అదే నిజమని అనుకోవడం తప్పు. షాపింగ్ లో నీకు నిధితో ఉన్న వసంత్ కనిపించాయడేమో కానీ నేను చిత్రని మిస్ అవుతున్న వసంత్ ని చూశాను. యశోధర్ మాట కోసం తన ప్రేమని త్యాగం చేసే పిరికివాడిని చూశాను అని వేద చిత్రకి ధైర్యం చెప్పేందుకు ట్రై చేస్తుంది.
ధైర్యం లేని ప్రేమ్ గెలుస్తుందా అక్క, అది జీవితాంతం శాశ్వతంగా ఉంటుందని నమ్మకం లేదని చిత్ర అంటుంది. నామీద నమ్మకం ఉంచు నీ లైఫ్, ప్రేమ నేను నిలబెడతాను అని వేద మాట ఇస్తుంది. మాలిని సులోచన వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారని యష్ తో చెప్తుంది. చిత్రకి పెళ్ళి కుదిరిందని వసంత్ ఎంగేజ్మెంట్ రోజే తనకి ఎంగేజ్మెంట్ అని యష్ చెప్తాడు. కాదు ఏదో జరుగుతుంది నువ్వు వెళ్ళి పుట్టింట్లో ఉన్న వేదని తీసుకుని రా అని చెప్తుంది. యష్ ని వేద వాళ్ళ అక్క ఫూల్ అనేసరికి కాదు శశి బావ పెద్ద ఫూల్ అని వేద అరుస్తుంది. అప్పుడే శశి వచ్చి ఆ మాటలు వింటాడు. నన్నే అంత పెద్ద మాట అంటావా అని వేదని సరదాగా కొట్టేందుకు పరిగెడుతుంటే తను వెళ్ళి బయట ఉన్న యష్ కి డాష్ ఇచ్చేస్తుంది. దీంతో యష్ కింద పడిపోతాడు తన మీద వేద పడుతుంది.