గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu September 13 Today Episode 554)


ఈరోజు ( మంగళవారం ఎపిసోడ్ లో)..వసుధార రూమ్ లో కూర్చుని ఆలోచిస్తుంటుంది. జగతి మేడం-మహేంద్ర సార్ పెళ్లిరోజు వేడుకలో తాను ఏ డ్రెస్ వేసుకోవాలి అనుకుంటుంది. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన రిషి..వసుకోసం గిఫ్ట్ తీసుకొస్తాడు. నీకోసం చీర తీసుకొచ్చాను కట్టుకో అంటాడు. శారీనా సార్ అంటూ..గతంలో చీరకట్టుకుని తూలిపడబోతుంటే రిషి పట్టుకున్న విషయం గుర్తుచేసుకుంటుంది వసుధార. ఆ ఆలోచన నుంచి బయటకు తీసుకొచ్చిన రిషి..నీకోసం తీసుకొచ్చాను, ఇది నీకు చాలా బావుంటుంది ఏమీ ఆలోచించకుండా కట్టుకో అని ఇస్తాడు... 






ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
దేవయానికి షాకిస్తూ జగతి-మహేంద్ర పెళ్లిరోజు వేడుక ఇంట్లోనే జరిపించేందుకు ఒప్పుకుంటాడు రిషి. పనిలో పనిగా వదని ధరణి సాయం కోసం అంటూ వసుధారని ఇంటికి తీసుకొస్తాడు.పూలు కట్టేందుకు కాంపిటేషన్ అంటూ రిషిని కూడా అక్కడ కూర్చోబెడతాడు మహేంద్ర.ఆ తర్వాత ఒక్కొక్కరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు...రిషి-వసుధార మాత్రమే మిగులుతారు. అప్పుడు రిషి కి మాల కట్టడం సరిగ్గా రాకపోతే వసు సహాయం చేస్తుంది.అలాగా అనుకోకుండా రిషి పూలమాలను వసు మెడ లో వేస్తాడు. ఇదంతా చూసి జగతి, మహేంద్ర, ధరణి, గౌతమ్ మురిసిపోతారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన దేవయాని రిషిని పంపించేందుకు ప్రయత్నించినా..మీరు వెళ్లండి పెద్దమ్మా అనేస్తాడు. ఇక చేసేది లేక విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని. 


Also Read: దీప కోసం డాక్టర్ అన్నయ్య ప్రయత్నం సక్సెస్, మోనిత చీటర్ అని కార్తీక్ తెలుసుకోనున్నాడా!


ఆ తర్వాత అందరం కలసి క్యారెమ్స్ ఆడుకుందామా అని అడుగుతుంది ధరణి. రిషి రూమ్ లోపలకు వెళ్లిపోతాడు. జగతి, మహేంద్ర, గౌతమ్, ధరణి, వసుధార అంతా క్యారమ్ బోర్డు కూర్చుంటారు.రావొచ్చు కదా సార్ అని వసు మెసేజ్ పెట్టడంతో రిషి ఎంట్రీ ఇస్తాడు. వెంటనే థ్యాంక్యూ సార్ అని మెసేజ్ చేస్తుంది వసుధార. వీళ్లిద్దరి చాటింగ్ చూసి జగతి-మహేంద్ర సైగలు చేసుకుంటారు. ఆ తర్వాత రిషి-జగతిని ఒక టీమ్ గా ఉంచాలని ప్లాన్ చేసిన మహేంద్ర..అనుకున్నట్టే చేస్తాడు. తనతో కలసి ఆడేందుకు రిషి ఒప్పుకోవడంతో ఆనందంలో ఉంటుంది జగతి. అదే సమయంలో మనమే గెలవాలి మేడం అని రిషి అనడంతో ఆనందానికి అవధులుండవు. మహేంద్ర, వసు, గౌతమ్, ధరణి కూడా వాళ్లిద్దర్నీ చూసి ఎంతో సంతోషపడతారు. మరి క్యారెమ్స్ గేమ్ లో... జగతి రిషి గెలిచారా, మహేంద్ర వసుధార గెలిచారో ఈ రోజు ఫుల్ ఎపిసోడ్ లో చూాడాలి. 


Also Read: వసుకి ప్రేమగా వడ్డించిన రిషి, దేవయాని కుట్ర కనిపెట్టే పనిలో జగతి-మహేంద్ర