చిత్ర, నిధి ఒకే డ్రెస్ కావాలని అడుగుతారు. దీంతో వేద, యష్ ఒకేసారి ఆ డ్రెస్ దగ్గరకి వస్తారు. ఆ డ్రెస్ నాకే కావాలి నాకే కావాలి అంటూ ఇద్దరు కొట్లాడుకుంటారు. మీ నిధికి మా చిత్రకి ఇష్టమైనవి అన్నీ లాగేసుకునే పనేనా వేరే ఏమి లేదా అని వేద అరుస్తుంది. ఈ డ్రెస్ మీరే తీసుకోండి నిధికి ఏదో ఒకటి నేనే చెప్పుకుంటాను అని యష్ వెళ్ళిపోతాడు. ఈ డ్రెస్ చాలా బాగుంది మొగుళ్ళ మీద గెలిస్తే ఆ కిక్కే వేరు అని వేద సంతోషపడిపోతుంది. ఖుషి కోసం ఆదిత్య మాల్ మొత్తం తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు. నీకేం కావాలో చెప్పు ఎవరిని అయినా అడిగితే తీసుకొస్తారు కదా అని మాళవిక అంటుంది. లేదు మామ్ మనమే వెతుక్కుంటూ వెళ్తే బాగుంటుందని ఆదిత్య అంటాడు.


ఆదిత్య పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోవడం యష్ చూసి వచ్చి ఆదిని పైకి లేపుతాడు. ఏమైనా దెబ్బలు తగిలాయా అని ఆత్రంగా అడుగుతాడు. హెల్ప్ చేసినందుకు థాంక్స్ చెప్పడంతో యష్ పొంగిపోతాడు. మామ్ వెళ్లిపోదాం పద అని తన తల్లితో కలిసి వెళ్లిపోతుంటే ఖుషి పిలుస్తుంది. ఇద్దరు సంతోషంగా కౌగలించుకుని మాట్లాడుకుంటారు. వేద ఒక చీర చూసి చాలా ఇష్టపడుతుంది. కానీ దాని రేటు చూసి చాలా ఎక్కువ అని అక్కడ నుంచి మూతి ముడుచుకుని వెళ్ళిపోవడం అంతా అక్కడ ఉన్న యష్ చూస్తాడు. ఇంతలోనే వేరే వాళ్ళు వచ్చి ఆ సారీ నచ్చిందని చెప్పి దాన్ని ప్యాక్ చేయమని చెప్తారు. యష్ వెంటనే వచ్చి నాకు ఈ సారీ కావాలి ప్లీజ్ నాకు ఇవ్వండి అని అడుగుతాడు. అతను ఒప్పుకోడు.. మా ఆవిడకి ఈ చీర చాలా బాగా నచ్చింది.. నేను ఇప్పటి వరకు తనకి ఏమి ఇవ్వలేదు ఇది తనకి నేను ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ ప్లీజ్ నాకు ఈ చీర ఇచ్చెయ్యండి అని అడుగుతాడు. వాళ్ళు సరే అని చీర ఇచ్చేసి వెళ్లిపోతారు.


Also Read: రాధ గురించి తెలిసి జానకి షాక్- ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడిన సత్య


ఆ చీర తీసుకొచ్చి వేదకి ఇస్తాడు. అది చూసి వేద చాలా సంతోషిస్తుంది. ఇది చాలా రేటు ఎక్కువ ఉంది వద్దులే అని అంటుంది. యష్ మాత్రం ఆ మాటకి చిరాకు పడతాడు. నచ్చింది అన్నావ్ కదా తీసుకో అని అంటాడు. మళ్ళీ చీర దగ్గర ఇద్దరు పోట్లాడుకుంటారు. తీసుకో అని యష్ బతిమలాడతాడు. తీసుకొను అని వేద చెప్పేసరికి యష్ ఖుషిని పిలిచి మీ అమ్మకి ఈ చీర బాగా నచ్చింది తీసుకోమంటే తీసుకోవడం లేదు అని చెప్పి ఇరికిస్తాడు. ఖుషి చెప్పిన కూడా తీసుకొను అంటుంది వేద. చీర వద్దని అనుకున్న వాళ్ళు యష్ ని చూసి ఆగిపోయి పలకరిస్తారు. మీ ఆయన ఈ చీర కోసం మమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని ఒప్పించి తీసుకొచ్చారు మీరు చాలా లక్కీ అని అంటారు. అది విని వేద చాలా సంతోషపడుతుంది. తర్వాత మళ్ళీ యష్ చీర ఇస్తే వేద తీసుకుంటుంది.


Also Read: తులసిని కాళ్ళు పట్టుకుని క్షమించమని నందుని అడగమన్న సామ్రాట్- బిత్తరపోయిన తులసి ఫ్యామిలీ


ఖుషి రాఖీ కట్టినందుకు ఆదిత్య తన కోసం గౌను గిఫ్ట్ గా తీసుకుంటాడు. యష్ ఆదిత్య కోసం డ్రెస్ తీసుకుంటాడు. దాన్ని ఆదికి ఇద్దామని తీసుకొస్తాడు. తీసుకోమని అడుగుతాడు కానీ ఆది నాకు వద్దని చెప్తాడు. నాకు వద్దు మా మమ్మీ చాలా కొంటుంది నేను తీసుకొను అని చెప్తాడు. నువ్వు నా మీద ఎంత కోపం చూపించినా నాకు ప్రేమ చూపించడమే తెలుసు ప్లీజ్ వద్దని అనకు తీసుకో అని ఇస్తాడు. ఈ కలర్ అంటే నాకు ఇష్టం ఉండదు, మీకు నా గురించి తెలియదు కదా అని ఆదిత్య వెళ్లిపోతూ ఉంటే ఖుషి ఎదురు పడుతుంది.