Horoscope 13th September 2022: వృషభ రాశి వ్యాపారులు, ఉద్యోగులు ఓ అడుగు ముందుకేస్తారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
మేషరాశివారు ఈ రోజు లావాదేవీల విషయంలో తొందరపడకండి. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారం సాధారంగా సాగుతుంది. పెద్దగా మార్పులుండవు. ఈ రాశి విద్యార్థులు ఎవరైనా పోటీ పరీక్షలు రాసి ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. పిల్లలకు సంబంధించిన ఏదైనా విషయం మిమ్మల్ని చిన్న ఇబ్బందికి గురిచేయవచ్చు.
వృషభ రాశి
ఈ రాశివారికి పూర్వీకుల ఆస్తుల నుంచి లాభం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైన సమయం. వ్యాపారులు లాభపడతారు. విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. జాగ్రత్తగా చూసుకోండి.
మిథున రాశి
ఈ రోజంతా మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులుంటాయి.మీ వ్యక్తిగత జీవితంలో మూడో వ్యక్తి జోక్యాన్ని అస్సలు సహించకండి. న్యాయపరమైన విషయాల్లో కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారు పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంటుంది. బంధువులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. మీలో ఉన్న సృజనాత్మకత మీ పనితీరుని మరింత మెరుగుపర్చి గౌరవాన్ని అందిస్తుంది. తలపెట్టిన పనులకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.
Also Read: ఈ వారం మూడు రాశులవారికి అనుకూల ఫలితాలు, ఆ రాశివారికి ఊహించని సంఘటనలు
సింహ రాశి
ఇంటా-బయటా గౌరవం పెరుగుతాయి. ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. భౌతిక సుఖాలు పెరుగుతాయి.
కన్యా రాశి
ఈ రాశికి చెందిన రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచిది. ప్రేమను పెళ్లిబంధంగా మార్చుకునేందుకు ఇదే మంచి సమయం. రోజంతా బిజీబిజీగా ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు.
తులా రాశి
ఈ రోజు తులా రాశివారు శుభవార్త వింటారు. మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. తొందరపాటు తగ్గించుకోకుంటే నష్టపోతారు.
వృశ్చిక రాశి
న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆదాయంలో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు. ఆచితూచి ఖర్చు చేయండి.
Also Read: ఈ రాశివారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటేనే సక్సెస్ అవుతారు, సెప్టెంబరు 12 నుంచి 18 వారఫలాలు
ధనుస్సు రాశి
ఈ రోజు ధనుస్సు రాశి వ్యక్తుల జీవితంలో సానుకూల మార్పులుంటాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు మంచి రోజు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
మకర రాశి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అనవసర మాటలు తగ్గించడం మంచిది. వేరేవారి మాటల మధ్య జోక్యం చేసుకోకండి. వివాదాలకు దూరంగా ఉండాలి.
కుంభ రాశి
ఈ రాశివారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు సీనియర్ అధికారుల మద్దతు లభిస్తుంది. తెలివిగా ఆలోచిస్తే అనుకున్న పనులు పూర్తవుతాయి..కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
మీన రాశి
అనవసర విషయాలపై దృష్టి పెట్టకండి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. మాటలు తగ్గించండి, వివాదాల్లో తలదూర్చకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.