Weekly Horoscope 12-18 September: సెప్టెంబరు 12 సోమవారం నుంచి సెప్టెంబరు 18 ఆదివారం వరకూ ఈ వారంలో తులా రాశి నుంచి మీన రాశివరకూ..ఆరు రాశుల  ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం...


మేషం నుంచి కన్యారాశి వరకూ వార ఫలాలు చూడాలంటే..ఈ లింక్ క్లిక్ చేయండి...


Also Read: ఈ రాశివారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటేనే సక్సెస్ అవుతారు, సెప్టెంబరు 12 నుంచి 18 వారఫలాలు


తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
ఈ వారం పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఓ సంఘటన మిమ్మల్ని బాధపెడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అప్పులు తీరిపోతాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో పెద్దల సలహాలు మీకు మేలుచేస్తాయి. వ్యాపారులకు శుభసమయం. ఉద్యోగులకు అనుకూల ఫలితాలున్నాయి. మీ పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు జాగ్రత్త వహించండి. కొన్ని సందర్భాల్లో మరీ ముక్కుసూటిగా వ్యవహరించడం మానుకోవాలి


వృశ్చిక రాశి (విశాఖ 4 పాదం,అనూరాధ, జ్యేష్ఠ)
ఈ రాశి ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులు పూర్తయ్యేవరకూ వదిలిపెట్టరు. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. రాజకీయ వర్గాల వారికి అనుకూల సమయం. ఆరోగ్యం బావుంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.


ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీ మాటతీరుతో అందర్న ఆకట్టుకుంటారు.కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఓర్పు, సహనంతో వ్యవహరిస్తే సక్సెస్ అవుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. పారిశ్రామిక వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. 


మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ధైర్యంగా చేసే పనులు సక్సెస్ అవుతాయి. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. వివాదాల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడండి. ఈ వారంలో ఓ శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో స్వల్ప లాభాలుంటాయి. వారం మధ్యలో స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ ప్రతిభకు తగిన ఫలితం లభిస్తుంది. 


కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. నిరుద్యోగులు  ఈ వారం ఉద్యోగం సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులను, అనుభవజ్ఞులను సంప్రదించడం మంచిది.


మీన రాశి (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ మెరుగుపడుతుంటుంది. ఈ వారం మీరు ఊహించని చాలా సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగులు శుభవార్తలు వింటారు, వ్యాపారులు లాభపడతారు. మీ పనితీరుకి ప్రశంసలు లభిస్తాయి. ఖర్చులు తగ్గించేందుకు ప్రయత్నించండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కలిసొస్తాయి.