వాట్సాప్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. కోట్లాది మంది తమ తమ రోజు వారీ అవసరాల కోసం ఈ మెసేజింగ్ యాప్ ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ ద్వారా చాటింగ్ తో పాటు వీడియో, ఆడియో కాల్స్ చేసుకోవచ్చు. తమ ఉద్యోగ, వ్యాపార పనులను వాట్సాప్ ద్వారా నిర్వహించుకోవచ్చు. వాట్సాప్ అనేది నిజానికి ఓ సముద్రం లాంటిది. ఇందులో ఎన్నో అద్భుతాలున్నాయి. చక్కటి ఫీచర్లు ఉన్నాయి. కానీ, చాలా మందికి వాటి గురించి తెలియదు. కొన్ని ట్రిక్స్ నేరుగా వాట్సాప్ లోనే ఉండగా.. మరికొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. వాటిలో ఒక ట్రిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డిలీట్ అయినా చూడవచ్చు!
వాట్సాప్ వినియోగదారులకు సాధారణంగా చాలా వీడియోలు, ఆడియోలు, మెసేజ్ లు వస్తుంటాయి. ఒక్కోసారి పొరపాటున ఆయా వీడియోలు, ఆడియోలు డిలీట్ అవుతాయి. ఇప్పుడు మన డిలీట్ చేసిన వీడియోలను, ఆడియోలను, మెసేజ్ లను చూడవచ్చు.
కొంత మంది అప్పుడప్పు కొన్ని సందేశాలను పంపించి కొద్ది సేపటికే తొలగిస్తారు. ఆ మెసేజ్ లను పొందిన వ్యక్తిలో ఒక క్యూరియాసిటీ కలుగుతుంది. ఇంతకీ డిలీట్ చేసిన మెసేజ్ లో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇందుకోసం కొంత మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని ట్రిక్స్ ఉపయోగించడం మూలంగా డిలీట్ చేసిన వాటిని చూడవచ్చు.
*ఈ ట్రిక్ కోసం ముందుగా థర్డ్ పార్టీ యాప్(WhatsAppdelete)ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
*ఆ తర్వాత మీ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి.
*ఆ తర్వాత ఓపెన్ చేయాలి.
*కొన్ని పర్మిషన్స్ అగుడుతుంది ఇవ్వాలి.
డిలీట్ చేసిన మెసేజ్, ఆడియో, వీడియో ఇలా చూడవచ్చు..
*WhatsAppdelete ఓపెన్ అయిన తర్వాత వాట్సాప్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది.
*ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి కుడివైపు పై భాగంలో ఉన్న మూడు చుక్కల మీద క్లిక్ చేయాలి.
*సెట్టింగ్‌లకు వెళ్లాలి.
*ఆ తర్వాత డేటా, స్టోరేజ్ యూసేజ్ పై క్లిక్ చేయాలి.
* మీడియా ఆటో డౌన్ లోడ్ కి వెళ్లి అన్ని ఆప్షన్స్ కి అనుమతించాలి.
*ఇది అన్ని రకాల ఫైల్ లను డౌన్ లోడ్ చేస్తుంది.
*ఆ తర్వాత ఈజీగా మెసేజ్, ఆడియో, వీడియోని తిరిగి చూసే అవకాశం ఉంటుంది.
ఆ తర్వాత ఎవరైనా మెసేజ్, ఆడియో, వీడియో క్లిప్ పంపి తొలగిస్తే.. ముందు డౌన్ లోడ్ చేసిన WhatsAppdelete యాప్ ను ఓపెన్ చేయాలి. ఇందులో డిలీట్ చేసిన మెసేజ్ లు, ఆడియో, వీడియో ఫైల్స్ మీకు కనిపిస్తాయి.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?