యాపిల్ వాచ్ సిరీస్ 8ను యాపిల్ త‌న తాజా ఈవెంట్లో లాంచ్ చేసింది. 2015లో యాపిల్ మొట్ట‌మొద‌టి వాచ్ ను లాంచ్ చేయ‌గా, ఇది ఆ వాచ్ ల్లో 9వ సిరీస్. ఇందులో జీపీఎస్, సెల్యులార్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన సేల్ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి జరగనుంది.


యాపిల్ వాచ్ 8 సిరీస్ ధ‌ర‌
యాపిల్ వాచ్ సిరీస్ 7 జీపీఎస్ ఓన్లీ వేరియంట్ ధ‌ర అమెరికాలో 399 డాల‌ర్లుగా (మ‌న‌దేశ క‌రెన్సీలో సుమారు రూ.31,800) నిర్ణ‌యించారు. మనదేశంలో దీని ధరను రూ.45,900గా నిర్ణయించారు. యాపిల్ వాచ్ సిరీస్ 8 జీపీఎస్ + సెల్యులార్ ఆప్ష‌న్ ధ‌ర 499 డాల‌ర్లుగా(సుమారు రూ.39,800) ఉంది. మిడ్ నైట్, స్టార్ లైట్, గ్రీన్, సిల్వర్, ప్రొడ‌క్ట్ రెడ్ రంగుల్లో ఈ వాచ్ కొనుగోలు చేయ‌వ‌చ్చు.


యాపిల్ వాచ్ ఎస్ఈ రెండో తరం వాచ్ ధ‌ర‌


ఇక యాపిల్ వాచ్ ఎస్ఈ జీపీఎస్ వేరియంట్ ధర అమెరికాలో 249 డాలర్లుగా (సుమారు రూ.19,800) నిర్ణయించారు. సెల్యులార్ వేరియంట్ ధర 299 డాలర్లుగా (సుమారు రూ.23,800) ఉంది. మనదేశంలో జీపీఎస్ మోడల్ ధర ను రూ.29,900గా నిర్ణయించారు.  మిడ్ నైట్, సిల్వర్, స్టార్‌నైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ అమెరికాలో సెప్టెంబర్ 16వ తేదీ నుంచి జరగనున్నాయి.


యాపిల్ వాచ్ 8 సిరీస్ స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు
యాపిల్ వాచ్ సిరీస్ 8లో జీపీఎస్, సెల్యులార్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేను అందించారు. ముందు తరం వాచ్ కంటే దీని డిస్‌ప్లే మరింత పెద్దగా ఉండనుంది. మహిళల్లో ఒవల్యూషన్ సైకిల్‌ను సైతం ట్రాక్ చేసే ఫీచర్‌ను యాపిల్ ఇందులో అందించారు. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ కూడా ఉంది.


యాపిల్ వాచ్ సిరీస్ 7 తరహాలోనే ఎన్నో ముఖ్య‌మైన హెల్త్, ఫిట్ నెస్ ఫీచ‌ర్లు కూడా ఇందులో అందించారు. ఎస్పీఓ2 ట్రాకింగ్ కూడా దీని ద్వారా చేయ‌వ‌చ్చు. ఎలక్ట్రికల్ హార్ట్ రేట్ సెన్సార్ ద్వారా హార్ట్ రేట్ ను కూడా ఇది లెక్కించ‌గ‌ల‌దు. ఈసీజీ రిపోర్టును అందించే ఏఎఫ్ఐబీ ఫీచ‌ర్ కూడా ఇందులో ఉంది. మెరుగైన స్లీప్ ట్రాకింగ్, స్లీప్ రెస్పిరేష‌న్ రేట్, స్లీప్ ట్రెండ్స్ ఫీచ‌ర్లు కూడా ఇందులో ఉన్నాయి.  ఒక్క‌సారి చార్జ్ చేస్తే 18 గంట‌ల పాటు ఈ వాచ్ సిరీస్ ప‌నిచేయ‌నుంది. ఫాస్ట్ చార్జింగ్‌ను ఇవి సపోర్ట్ చేయనున్నాయి. అదే లో పవర్ మోడ్‌లో ఉపయోగిస్తే ఏకంగా 36 గంటల బ్యాకప్‌ను ఇది అందించనుంది.


యాపిల్ వాచ్ ఎస్ఈ (రెండో తరం) స్పెసిఫికేషన్లు
ఇందులో రెటీనా ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 2020లో లాంచ్ అయిన దీని ముందు వెర్షన్ వాచ్ కంటే 30 శాతం పెద్దగా ఇది ఉండనుంది. వేగవంతమైన ఎస్8 ప్రాసెసర్‌పై ఈ వాచ్ పనిచేయనుంది. హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు, ఈసీజీ, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు. సెల్యులార్ కనెక్టివిటీ మోడల్ కూడా  ఉంది. ఫ్యామిలీ సెటప్ ఫీచర్ కూడా ఈ వాచ్‌లో అందించారు. ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, ఫాల్ డిటెక్షన్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్లను యాపిల్ అందించింది.