Karthika Deepam September 13th Episode 1456 (కార్తీకదీపం సెప్టెంబరు 13 ఎపిసోడ్)


దీప చెప్పినట్టు ఒంటరిగానే పూజచేస్తాడు కార్తీక్. పూజ పూర్తయ్యాక దీప వెళ్లిపోయిన తర్వాత కార్తీక్  పై మోనిత ఫైర్ అవుతుంది. అసలు నువ్వు ఎప్పుడు వంటలక్కని కలిశావ్ అని అడుగుతుంది..అప్పుడు కార్తీక్ నిన్న రాత్రి అని దీపను కలిసిన విషయం చెబుతాడు
కార్తీక్: వంటలక్కా..నువ్వు మొదటి సారి చూసినప్పుడు నా భార్యని అని చెప్పావు..నిన్ను చూడాగనే ఏదో గుర్తొస్తోంది.
దీప: ఏంటి డాక్టర్ బాబు గుర్తొస్తోందా..
కార్తీక్: నాకు ఏదీ గుర్తుండడం లేదు..పూజకు రానన్నావంట కదా..అందుకే నేను పిలవడానికి వచ్చాను
దీప: పూజలో మీరు ఒక్కరే కూర్చోవాలి..గతం గుర్తుకురావాలి..మీ భార్య, పిల్లలతో కలసి సంతోషంగా ఉండాలి  అందుకే ఒక్కర్నే కూర్చోమంటున్నా..
కార్తీక్: నువ్వు మంచి విషయమే కదా చెప్పావ్..తప్పకుండా ఫాలో అవుతాను
దీప: మర్చిపోరు కదా...
కార్తీక్: మర్చిపోయినా మర్చిపోతాను ఎందుకైనా మంచిదని పూజలో నేను ఒక్కడినే కూర్చోవాలని పేపర్ పై రాసుకుని జేబులో పెట్టుకుంటాడు. రేపు ఈ చీటీ చూడగానే నీకిచ్చిన మాట గుర్తుచేసుకుంటాను... సరే వంటలక్కా వెళ్లొస్తాను...
అదీ జరిగింది మోనిత అంటాడు...
మోనిత: నేను వెళ్లి పిలిచాను కదా..నువ్వెందుకు వెళ్లాలి..మనిద్దరం కలసి పూజచేయాలంటే నువ్వు ఒక్కడివే కలసి పూజ చేయాలంది అంటే..మనిద్దర్నీ విడదీయాలని ఎందుకు చూస్తోంది..
కార్తీక్: భార్య పిల్లలతో కలసి ఉండమనే కదా పూజ చేశాను..నీ కోసమే కదా..నువ్ నా భార్యవి కాదా. నాకు సాయం చేసింది నేను సాయం చేశాను
మోనిత: సాయం చేస్తే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా...
కార్తీక్: ఏం మాట్లాడుతున్నావ్ మోనిత..నువ్వెలా బిహేవ్ చేస్తే నేను అలాగే బిహేవ్ చేస్తానంటూ కోపంగా వెళ్లిపోతాడు..
మోనిత: ఇంత చేస్తున్నది దీపకి అప్పగించడానికా..ఏదో ఒకటి చేసి కార్తీక్ కి నాపై ప్రేమ కలిగేలా చేసుకుంటాను...


Also Read: దీప ప్లాన్ సక్సెస్ - వినాయకుడి సాక్షిగా మోనిత మాట కాదని దీప మాట విన్న కార్తీక్


సౌందర్య ఇంట్లో వినాయక పూజ చేస్తారు.. శౌర్యకి, నాకు అంటూ రెండు దండలు తీసుకొస్తుంది హిమ. శౌర్య గురించి హిమ బాధపడుతుంటుంది. అక్కడకు వారణాసిని పంపించాం కదా బాగా చూసుకుంటాడులే అని ధైర్యం చెబుతారు సౌందర్, ఆనందరావు. 
హిమ: అమ్మా నాన్న ఉన్నారని అంటోంది..నిజంగా ఉన్నారా
సౌందర్య: ప్రతి దానికీ కాలమే సమాధానం చెబుతుంది..వేచి చూడడమే మన పని...


దీప ఇంటికి వస్తాడు డాక్టర్ అన్నయ్య.. 
డాక్టర్ అన్నయ్య: ఈ రోజు మోనితతో కలసి డాక్టర్ బాబు పూజ చేయకుండా ఆపావ్ సంతోషమే కదా
దీప: సంతోషమో బాధో తెలియడం లేదు..ఈ సంతోషం శాశ్వతం అయ్యేదెప్పుడు
డాక్టర్ అన్నయ్య: త్వరలోనే ఆయనకు గతం గుర్తొస్తుందిలేమ్మా..
దీప: నేను చేసిన సాయానికి కృతజ్ఞతగా ఈ పని చేశారు..
డాక్టర్ అన్నయ్య: కార్తీక్ మనసులో నీకు స్థానం ఉంది..అందుకే మోనిత చెప్పినా కూడా నీకిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. ఎంత తొందరగా గుర్తొస్తావ్ అన్నది నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది..
దీప: అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాను..కానీ ఈ రోజు తగిలిన దెబ్బకు మోనిత ఏం చేస్తుందో ఏంటో..
డాక్టర్ అన్నయ్య: డాక్టర్ బాబుని చూపించవా నాకు.. ముందు మోనితని చూడాలని ఉంది
దీప: చవితి రోజు చంద్రుడిని చూసినదానికన్నా..దాని మొహం చూస్తేనే ఎక్కువ నీలాపనిందలు వస్తాయి..
ఇద్దరూ నవ్వుకుంటారు...


Alos Read: 'లైగర్'ని అన్న మోనిత,'లోఫర్'వి అన్న దీప - వినాయక చవితి పూజలో మోనితకు షాక్ ఇచ్చిన కార్తీక్


మోనిత
దీప దగ్గరకు ఎందుకు వెళ్లావని అడిగితే..నాపై కోపపడ్డాడంటే పరిస్థితి చేజారిపోయేలా ఉంది..అసలు కార్తీక్ ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాను.. ప్రేమ లేకపోవడమే ప్రాబ్లెమా..భార్యని అని చెప్పడమే కానీ కార్తీక్ ఎప్పుడూ నాతో ప్రేమగా లేడు..అలా నా మాట వినాలంటే ప్రేమ పుట్టేలా చేసుకోవాలి..నా ఆరోగ్యం బాగాలేకపోతే నాతో ప్రేమగా ఉంటాడు కదా..ఇదే మంచి ఐడియా అని వెంటనే ముసుగేసుకుని పడుకుంటుంది...


కార్తీక్: ఏమైంది మోనిత..
మోనిత: జ్వరంగా ఉంది..సడెన్ గా వచ్చింది..
కార్తీక్: ఇందాక నిన్ను నేను తిట్టాను కదా అందుకే జ్వరం వచ్చింది.. అయినా ఎందుకు చిరాకు తెప్పిస్తావ్ అనవసరంగా తిట్టాను..సరే డాక్టర్ ని పిలుస్తాను..
మోనిత: అవసరం లేదు..నా దగ్గర కూర్చో..నాలో ఆవేశమే కానీ ఆవేదన అర్థం చేసుకోలేదు..నీలో కన్నబిడ్డను చూసుకుంటున్నా కానీ అర్థం చేసుకోవడం లేదు..నాపై ప్రేమ అస్సలు లేదు.నన్ను పరాయిమనిషిలా చూస్తున్నావ్. నువ్వు ఇలాగే ఉంటే ఎక్కడ నాకు దూరం అయిపోతావో అని భయం వేస్తోంది..
కార్తీక్: చూడు బంగారం...నీకు ఎంత ప్రేమ ఉన్నా కోపం, చిరాకు ఎలా వస్తాయో నాక్కూడా అంతే..అనవసరంగా నన్ను అపార్థం చేసుకోవద్దు.. డాక్టర్ ని తీసుకొస్తాను ఉండు..
మోనిత: ఆవేశం వచ్చినా ప్రేమ వచ్చినా తట్టుకోవడం కష్టం..పోనీలే..ఈ రోజు దగ్గరైనట్టు రోజూ దగ్గరైతే చాలు... 


దీప-డాక్టర్ అన్నయ్య ఇద్దరూ కార్తీక్ ఇంటికి వెళుతుంటారు..ఇంతలో కార్తీక్ ఎదురుపడతాడు. మోనితకి జ్వరంగా ఉందని కార్తీక్ చెప్పడంతో మా అన్నయ్య కూడా డాక్టరే అని దీప చెబుతుంది. నేనంటే పడదు కాబట్టి మా అన్నయ్య అని చెప్పకండి అంటుంది దీప. లోపలకు వెళతారంతా..


రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
మోనితని టెస్ట్ చేసి మందులు రాసిస్తాడు..ఆ చీటీ చూసిన మోనిత ఆవేశంతో ఊగిపోతుంది. ఎవడ్రా నువ్వు నిన్ను ఆ వంటలక్క పంపించిందా అని కాలర్ పట్టుకుంటుంది... కార్తీక్ ఆపేందుక ప్రయత్నిస్తాడు...https://telugu.abplive.com/web-stories/total-lunar-eclipse-on-november-8-2022-51044