నీలావతి నోటికొచ్చినట్టు మాట్లాడేసరికి జ్ఞానంబ తనని తిడుతుంది. నా పెద్ద కోడలు నిజాయితికి నిలువుటద్దం, బాధ్యతకి మరో రూపం పూజ ఉన్న కూడా బయటకి వెళ్ళింది అంటే అంత కంటే ముఖ్యమైన పని ఉండే ఉంటుంది, అనవసరంగా నోరు పారేసుకోకండి అని జ్ఞానంబ అంటుంది. జానకి జెస్సిని తీసుకుని ఇంటికి వస్తుంది. తనని చూసి అఖిల్ తో పాటు అందరూ షాక్ అవుతారు. పూజ వదిలేసి నువ్వు బయటకి వెళ్ళింది ఈ అమ్మాయిని తీసుకురావడానికా.. ఈ అమ్మాయి నా కళ్ల ముందు ఉండటానికి వీల్లేదు వెంటనే పంపించేసేయ్ అని జ్ఞానంబ అంటుంది. మీతో ఒకసారి మాట్లాడాలి అని జానకి అడుగుతుంది. అవన్నీ తర్వాత తనని పంపించు అంటుంది. తన గురించే మాట్లాడాలి. పూజ బాధ్యత నా మీద పెట్టినా కూడా బయటకి వెళ్ళి తనని తీసుకొచ్చాను అంటే అర్థం చేసుకోమని చెప్తుంది. నలుగురిలో కాదు అని జానకి అంటుంది. ఇప్పుడు కాదు పూజ అయినక మాట్లాడదామని చెప్తుంది.


జానకి, రామా పీటల మీద కూర్చుని పూజ చేస్తారు. వినాయకుడి పూజ అయిన తర్వాత నీ చేత్తో పుస్తకాలు పంచి పెడితే నీ ఆశ నెరవేరుతుందని జ్ఞానంబ చెప్తుంది. సరే అని అందరికీ జానకి పుస్తకాలు ఇస్తుంది. ఏదో మాట్లాడాలి అన్నావ్ కదా రా మాట్లాడుకుందాం అని జానకిని జ్ఞానంబ పిలుస్తుంది. ఎందుకు పండగ పూట పూజ దగ్గర ఉండకుండా వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చావాని అడుగుతుంది. మన ఇంటికి ఏదైనా సమస్య వస్తే మన ఇంటి గుమ్మం లోపలికి రాకుండానే పరిష్కరిద్దాం అనుకున్నా.. కానీ పరిస్థితి నా చెయ్యి దాటి పోయింది. నేను మీకు ఈ విషయం చెప్పాలనుకున్న ప్రతిసారీ మీరు అఖిల్ మీద పెట్టుకున్న నమ్మకం ఆశ నన్ను చెప్పనివ్వకుండా ఆపేశాయి. ఏంటి సమస్య అను జ్ఞానంబ అడుగుతుంది.


Also Read: రాధ గురించి తెలిసి జానకి షాక్- ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడిన సత్య


నేను చెప్పేది విని మీకు కోపం రావచ్చు బాధ కలగొచ్చు, కానీ అది నిజం. అది విని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. జెస్సి, అఖిల్ ప్రేమించుకున్నారని చెప్పేస్తుంది. మీ వదిన చెప్పింది నిజమా అని జ్ఞానంబ కోపంగా అడుగుతుంది. ప్రేమించినప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు అని జానకి అంటుంది. అలాంటిది ఏమి లేదమ్మా నాకు జెస్సికి ఎటువంటి సంబంధం లేదని అఖిల్ అనేసరికి జానకి షాక్ అవుతుంది. జెస్సిని లవ్ చేసిన విషయం నాతో చెప్పి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావ్ అని జానకి నీలాదిస్తుంది. ఎందుకు వదిన నన్ను ఇలా ఇరికిస్తున్నావ్ అని అఖిల్ అంటాడు. జెస్సికి నాకు కాలేజీలో గొడవ అయింది అందుకని తాను నా మీద ఏవో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను ఎందుకు అనుమానిస్తున్నావ్ అని అఖిల్ అంటాడు.


చదువు తప్ప నాకు ప్రేమ మీద ధ్యాస లేదని అఖిల్ చెప్తాడు. తప్పు చేసి ఇప్పుడు ఇలా అంటే కడుపుతో ఉన్న జెస్సి పరిస్థితి ఏంటి అని జానకి ఆవేశంగా అడుగుతుంది. అది విని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. జెస్సి, అఖిల్ ప్రాణంగా ప్రేమించుకున్నారు, కలిసి తిరిగారు, తొందర పడ్డారు అని జానకి చెప్తుంది. ఈ ప్రేమ కరెక్ట్ కాదని దూరంగా ఉండమని నచ్చజెప్పే ప్రయత్నం చేశాను మన ఇంటి పరువు పోకూడదని జెస్సిని తీసుకువచ్చాను అని జానకి చెప్తుంది. అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పరా  అని జ్ఞానంబ అడుగుతుంది. నీ మీద ఒట్టేసి చెప్తున్నా జెస్సికి నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా అని అఖిల్ అంటాడు. జెస్సి వేరే ఎవరినో లవ్ చేసింది వాడు హ్యాండ్ ఇచ్చాడు అందుకే వదిన్ని అడ్డం పెట్టుకుని నామీద నింద వేస్తున్నారని అఖిల్ అంటాడు.


Also Read: తులసిని కాళ్ళు పట్టుకుని క్షమించమని నందుని అడగమన్న సామ్రాట్- బిత్తరపోయిన తులసి ఫ్యామిలీ


అమ్మ మీద ఒట్టేసి అమ్మని, జెస్సిని మోసం చేస్తున్నావని జానకి అంటుంది. లేదు జానకి మనిషి అబద్ధం చెప్పినా కన్నీళ్ళు మోసం చెయ్యవు, అఖిల్ కనీళ్ళలో నిజాయితీ కనిపిస్తుందని జ్ఞానంబ అంటుంది. చెప్పింది నువ్వు కాబట్టి నిజమని అనుకున్నా కానీ అఖిల్ ఒట్టేసి చెప్పిన తర్వాత నువ్వు చెప్పింది కూడా అబద్దం అని అంటుంది. ఒక్కోసారి మన కన్ను కూడా మనల్ని మోసం చేస్తుందని జానకి అంటుంది. జెస్సి ఫోన్లో వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోస్ ఉన్నాయి అవి చూపిస్తాను అంటే అవసరం లేదని జెస్సి వేరే వాళ్ళతో కలిసి ఉన్నట్టుగా ఉన్న ఫోటోస్ అఖిల్ కొన్ని జ్ఞానంబకి చూపిస్తాడు.