వినాయకుడి బొమ్మలు అమ్ముకునే అమ్మాయిని నిజంగా మనం ఎక్కడా చూడలేదా? తనని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు బాగా పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తుందని కార్తీక్ మోనితని అడుగుతాడు. అంతక ముందు ఎప్పుడు ఆ అమ్మాయిని చూడలేదని మోనిత అంటుంది. రోడ్డు మీద చాలా చోట్ల చిన్న పిల్లలు పని చేస్తూ కనిపించారు, కానీ ఎవరి మీద కలగని జాలి ఈ అమ్మాయి మీదే ఎందుకు అనిపించిందని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత డైవర్ట్ చేద్దామని చూసినా చుట్టూ తిరిగి పాప దగ్గరకే వస్తున్నాడు అని మోనిత మనసులో తిట్టుకుంటుంది. ఏ సంబంధం లేని వాటి గురించి నాదగ్గర అడుగుతుంటే నాకు చిరాకుగా ఉంటుందని మోనిత అంటుంది.


వంటలక్కని పిలిచావా అని అడుగుతాడు. కూతురు అయిపోయింది, ఇప్పుడు పెళ్ళాం గురించి మొదలు పెట్టాడు అని మోనిత మనసులో అనుకుంటుంది. పిలిచాను కార్తీక్ కానీ తను విగ్రహం కొనుక్కుంది అంట ఇంట్లోనే పూజ చేసుకుంటాను రాను అని చెప్పిందని చెప్తుంది. అయితే తన ఇంట్లోనే పూజ చేసుకుంటుంది అన్నమాట అని కార్తీక్ అంటాడు. దీప వినాయకుడికి పూజ చేసుకుంటూ ఉంటుంది. నా రాముడు నన్ను చూడగానే ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు, నా భర్తకి గతం గుర్తుకు రావడం కష్టంగా ఉంది. ఆ కష్టాన్ని దాటించు నా భర్త నన్ను గుర్తు పట్టేలా చెయ్యి, లేదంటే మోనిత మీద డాక్టర్ బాబు కి నమ్మకం పోయేలాగా నాకు దారి అయిన చూపించు అని ఏడుస్తుంది. మోనిత ఇంట్లో వినాయకుడి పూజ ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. దీప మోనిత ఇంటికి వస్తుంది. కార్తీక్ పంచ కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మోనిత సాయం చెయ్యడానికి చూస్తుంది. వాళ్ళిద్దరినీ అలా చూసి దీప చాలా బాధపడుతుంది.


Also Read: రాధ గురించి తెలిసి జానకి షాక్- ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడిన సత్య


బయటకి వెళ్తూ మీ సార్ కి పంచె కట్టుకోవడం రావడం లేదు కాస్త హెల్ప్ చెయ్యి అని దీప శివకి చెప్తుంది. శివ వెళ్ళి నేను చేస్తాను అంటే ఎవరు చెప్పారు అని మోనిత అడుగుతుంది. వంటలక్క చెప్పిందని అనేసరికి వంటలక్క వచ్చిందా అని కార్తీక్ ఆత్రంగా వెళ్లబోతుంటే మోనిత ఆపుతుంది. నేనేం పాపం చేశాను దేవుడు ఇంత అన్యాయం చేస్తున్నాడు అని దీప కుమిలిపోతుంది. కార్తీక్ వచ్చి తనతో మాట్లాడతాడు. నీలో ఏదో తెలియని బాధ దాగుంది, నాకు కూడా ఏదో తెలియని బాధ దాగుంది కానీ గుర్తుకు రావడం లేదు. నీ బాధ ఏంటో నాకు చెప్పొచ్చు కదా అని అడుగుతాడు. మీకు గతం గుర్తుకు రావడమే నా బాధ అని దీప మనసులో అనుకుంటుంది.


మోనిత కార్తీక్ కలిసి పూజ చెయ్యడానికి కూర్చో బోతుంటే దీప ఆపుతుంది. ఆగండి డాక్టర్ బాబు మీరు నాకు ఒక మాట ఇచ్చారు గుర్తుందా అని అడుగుతుంది. లేదని చెప్పేసరికి నాకు తెలుసు డాక్టర్ బాబు మీకు గుర్తు ఉండదని అందుకే పేపర్ మీద రాసి జేబులో పెట్టాను అని దీప చెప్తుంది. ఏం మాట ఇచ్చాడే ఏం రాశావ్ అందులో అని మోనిత కంగారుగా అడుగుతుంది. నాకు ఏదో షాక్ ఇద్దామని పూజకి పిలిచావ్ కదా ఇప్పుడు నేను ఇచ్చే షాక్ ఏంటో అసలు ఊహించి ఉండవు అని దీప చెప్తుంది. అప్పుడే కార్తీక్ చీటి తీసుకుని వస్తాడు. పూజలో నేను ఒక్కడినే కూర్చోవాలి, నేనే పూజ చెయ్యాలి అని చీటిలో రాసి ఉంటుంది. అలా ఎలా చేస్తావ్ అని మోనిత అరుస్తుంది. నా భార్య అనుకున్నది జరగాలి, నన్ను నా భార్యని విడదీయాలి అనుకున్న వాళ్ళు నాశనం అయిపోవాలి. నాకు నా భార్యకి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేకుండా సంతోషంగా బతకాలని కోరుకుంటున్నట్టు పూజ చేయమని చెప్పిందని కార్తీక్ చెప్తాడు.


Also Read: చిత్ర, వైభవ్ ఓవర్ యాక్షన్- కన్నీళ్ళు పెట్టుకున్న వసంత్, వేద, యష్ చిలిపి కొట్లాట


కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయిందే నీ పరిస్థితి అని దీప సంబరపడుతుంది. వంటలక్కకి మాట ఇచ్చాను కదా ఈసారికి ఒక్కడినే పూజ చేస్తాను ఈసారి వినాయక చవితికి చేస్తానులే అని కార్తీక్ అంటాడు. కార్తీక్ కి గతం తీసుకురావడానికి దీప ప్రయత్నిస్తుంది.. కానీ మోనిత మాత్రం చాలు అని గట్టిగా అరుస్తుంది. వంటలక్క చెప్పేవి ఏవి గుర్తురావు ఎందుకంటే అలాంటివి ఏవి లేవని అంటుంది. కార్తీక్ ఒక్కడే పూజలో కూర్చుంటాడు. నువ్వు ఎంత ప్రయత్నించినా కార్తీక్ కి గతం గుర్తుకు రాదు రానివ్వను అని మోనిత అంటుంది. ఈ పండగకి డాక్టర్ బాబు ఒక్కడినే పూజలో కూర్చోబెట్టాను అదే నా విజయం అని దీప అంటుంది.