రాధ దేవికి జడ వేస్తుంటే వాళ్ళిద్దరినీ చూస్తూ నిలబడుతుంది చిన్మయి. మరో వైపు మాధవ్ వాళ్ళకి కొద్ది దూరంలో గడ్డం చేసుకుంటున్నట్టుగా కూర్చుని అద్దంలో తనని చూస్తూ ఉంటాడు. రాధ చిన్మయిని పలకరిస్తుంది. నువ్వు కూడా చెల్లితో పాటు కరాటే నేర్చుకుంటావా అని అడుగుతుంది లేదు నేను నీతోనే ఉంటాను అని అంటుంది. అప్పుడే జానకి ఇంట్లో నుంచి బయటకి వస్తుంది. మాధవ్ రాధని అద్దంలో చూస్తూ ముద్దు పెట్టుకోవడం జానకి కంట పడుతుంది. అది చూసి జానకి షాక్ అవుతుంది. దేవిని కరాటే క్లాస్ కి తీసుకుని వెళ్తాను మాధవ్ అనేసరికి అవసరం లేదు నేనే తీసుకుని వెళ్తాను అని రాధ వెళ్ళిపోతుంది.
ఏంటి వీడు ఇలా తయారయ్యాడు అలాంటి వెధవ పని రాధ చూస్తే ఎంత బాధపడేది అని జానకి మనసులో అనుకుంటుంది. రాధ కూడా అలా చిరాకుగా మాట్లాడి వెళ్తుంది. అసలు ఏం జరుగుతుంది. చాటుగా వీడు ఇలాంటి చండాలమైన పని చేస్తున్నాడు అంటే వీడి ఉద్దేశం ఏంటి అని జానకి ఆలోచనలో పడుతుంది. ఆ ఫోటో చిన్మయి కాకుండా దేవి చూసి ఉంటే బాగుండేది, కన్నతండ్రిని నేనే అని తెలిపోయి ఉండేది నాకు ఈ నరకం తప్పేది అని ఆదిత్య ఆలోచిస్తూ ఉండగా దేవుడమ్మ అక్కడికి వస్తుంది.
Also Read: వేదకి సైట్ కొడుతున్న యష్- వసంత్, నిధి ఎంగేజ్మెంట్లో కల్లోలం సృష్టించేందుకు మాళవిక ప్లాన్
‘నిన్ను చూసి ఊరి వాళ్ళు సంతోషపడటం కాదు ఇంట్లో వాళ్ళు సంతోషపడాలి. నీ వల్ల సత్య సంతోషంగా ఉందా? నువ్వు ఇలా మాట్లాడక సత్య బాధపడుతుంది. నువ్వు ఏ ఆలోచనలో ఉండి ఆ మాట అన్నావో కానీ పిల్లలు వద్దు అంటే ఏ ఆడది అయినా ఆ మాట భరించలేదు. అసలు పిల్లలు వద్దు అనే మాట ఏంటి, ఆ మాట భార్య తట్టుకోగలదా. నీ కోసం బతికే సత్యని ఇంతగా బాధపెట్టకూడదు. వెళ్ళి తనని దగ్గరకి తీసుకుని ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడు’ అని దేవుడమ్మ చెప్తుంది.
మళ్ళీ ఆ ఇంట్లోనే ఎందుకు ఉండాలని అనుకుంటున్నావ్ అని భాగ్యమ్మ అడుగుతుంది. నన్ను విడిచిపెట్టి ఎలా వెళతావ్ అమ్మ అని చిన్మయి ఏడుస్తుంటే ఎలా వచ్చేది అని రుక్మిణి అంటుంది. నీ బతుకు మారేది ఎలా అని భాగ్యమ్మ అడుగుతుంది. చిన్మయిని విడిచిపెట్టి నేను రాలేను నన్ను వదిలేయ్ అని రుక్మిణి చెప్తుంది. బిడ్డని వదిలిపెట్టి రావడం నావల్ల కావడం లేదని అంటుంది. సత్య బాధగా ఫోన్లో ఆదిత్య ఫోటో చూసుకుంటూ ఉంటుంది. ఆదిత్య వచ్చి మాట్లాడతాడు. నన్ను తిట్టాలి, కొట్టాలి అనిపిస్తే కొట్టు సత్య. నేను నిన్ను ఎంత బాధ పెట్టనో అమ్మ చెప్పేవరకి నాకు అర్థం కాలేదు. సోరి సత్య. నాకున్న ఆలోచనలు, ప్రెజర్ వల్ల ఆ క్షణంలో అలా మాట్లాడేశాను సోరి సత్య అని తనని దగ్గరకి తీసుకుంటాడు. నాకు నిన్ను ప్రేమించడం తప్ప బాధపెట్టడం రాదు ఆదిత్య అని సత్య ఎమోషనల్ అవుతుంది. ఇద్దరు మాట్లాడుకుంటారు. బయటకి వెళ్దాం అని సత్య అడగటంతో సరే అంటాడు.
Also Read: మాధవ్ కి ఝలక్ ఇచ్చిన రుక్మిణి- దేవుడమ్మకి నిజం చెప్పిన సత్య
జానకి మాధవ్ దగ్గరకి వచ్చి నీ అలవాట్లు పద్దతులు మారిపోతున్నాయి అని అడుగుతుంది. ఏం మారాయి అని అడుగుతాడు. ఆ గిటార్ వాయించడం ఏంటి అని అంటుంది. మనసుకు ఆనందం అనిపించినప్పుడు అలా గిటార్ ప్లే చేస్తూ ఉంటాను అని చెప్తాడు. ఎవరు ఆనందంగా లేనప్పుడు నీకు మాత్రమే ఎందుకు ఆనందం కలుగుతుంది. ఇంతక ముందులా నువ్వు లేవు నీలో ఏదో మార్పు నాకు కనిపిస్తుందని జానకి అడిగితే అలా ఏమి లేదని మాధవ్ అంటాడు. మరి అద్దంలో.. అని జానకి అడగబోతుంటే దేవి అవ్వా అని పిలిచి వాళ్ళ దగ్గరకి వస్తుంది.