నువ్వే అమ్మ అనుకున్నా నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలనమ్మా నన్ను వదిలి వెళ్లొద్దమ్మా ప్లీజ్ అని చిన్మయి చాలా ఏడుస్తుంది. నేను లేకపోతే ఏంటి అవ్వతాత ఉన్నారు కదా అని అంటుంది. ఎంతమంది ఉన్న నువ్వు కాదుగా ఒకవేల నాకు చెప్పకుండా నువ్వు వెళ్లిపోతే నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చేస్తాను అని చిన్మయి అంటుంది. నేను చెప్పేది ఎవరికి చెప్పను అని మాట ఇవ్వు అని చిన్మయిని దగ్గర మాట తీసుకుంటుంది రాధ. జానకి తెల్లారి నిద్ర లేచి రాధ కోసం వెతుకుతూ ఉంటుంది. బయట ఉన్న మాధవ్ రాధ మాటలు తలుచుకుని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ‘తాళి చూపించి అది ఆదిత్య కట్టిన తాళి దానికే విలువ అన్నావ్ కదా తాళి అది కాదు నేను కట్టిందే తాళి అని నీకు అర్థం అయ్యేలా చేస్తాను. నిన్ను నా దాన్ని చేసుకుని నిన్ను దేవిని ఇంట్లోనే కట్టిపడేస్తాను. ఈ ఇంటి గడప దాటే ఏ అవకాశం నీకు ఇవ్వను అలా చేస్తాను’ అని మాధవ్ రగిలిపోతూ ఉంటాడు.
రాధ కనిపించడం లేదని నేను కంగారు పడుతుంటే నువ్వేంటి గిటార్ వాయిస్తూ కూర్చున్నావ్ అని మాధవ్ దగ్గరకి వస్తుంది జానకి. రాధ ఇంట్లో లేకపోవడం ఏంటి అని మాధవ్ షాక్ అవుతాడు. రాత్రి నాతో చెప్పింది నేను ఈ ఇంట్లో ఉండను అని తెల్లారి చూస్తే రాధ కనిపించడం లేదని టెన్షన్ పడుతుంది. రాధ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అన్నదా ఎప్పుడు అని అడుగుతాడు. నిన్న బయటకి వెళ్ళి ఇల్లు కూడా చూసుకుంది అని జానకి చెప్తుంది. ఇంట్లో కనిపించడం లేదంటే ఎక్కడికి వెళ్ళిందని మాధవ్ కూడా ఆలోచిస్తాడు. ఆ ఇంట్లో నుంచి బయటకి రావాలని అన్నీ ఏర్పాట్లు చేసుకుని ఆగిపోవడం ఏంటి రుక్మిణి అని ఆదిత్య అడుగుతాడు.
Also Read: సామ్రాట్ ముందే నందుని అవమానించిన అనసూయ- పండగ సంబరాల్లో గొడవపడిన ప్రేమ్, శ్రుతి
రుక్మిణి: ఆగాల్సి వచ్చింది చిన్మయి కోసం గడప దాటి రాలేకపోయాను పెనిమిటి
ఆదిత్య; చిన్మయి కోసం రాలేకపోవడం ఏంటి
రుక్మిణి: ఇల్లు విడచి వస్తున్నా కదా బిడ్డకి మంచి చెడులు చెప్దామనుకున్నా కానీ చిన్మయి చేతిలో ఫోటో చూసిన తర్వాత నాకు నోట్లో నుంచి మాటే రాలేదు పెనిమిటి అని పెళ్లి ఫోటో చూపించింది మొత్తం చెప్తుంది
ఆదిత్య: అంటే చిన్మయికి మొత్తం తెలిసిపోయినట్లేనా తను వెళ్ళి రామూర్తి గారికి జానకి గారికి చెప్తే
రుక్మిణి: చెప్పను అని నా మీద ఒట్టేసింది. దేవమ్మ వాళ్ళ అవ్వ తాత దగ్గర ఆనందంగా ఉండాలని చాలా ఆశగా ఉంది. కానీ దేవమ్మ కోసం చిన్మయిని ఎలా దూరం చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఇద్దరినీ ఎప్పుడు వేరుగా చూడలేదు. తనకి ఇప్పుడు నేను ఏమి చెప్పి సముదాయించాలో అర్థం కావడం లేదని అంటుంది.
జానకి టెన్షన్ గా రాధ కోసం ఆలోచిస్తూ ఉంటే అప్పుడే తను వస్తుంది. ‘నీకు ఈ ఇంట్లో ఏ కష్టం వచ్చినా నాతో చెప్పు, నువ్వు లేని ఈ ఇంటిని నేను ఊహించుకోలేను. ఇది నీ ఇల్లు ఇంకెప్పుడు ఆ ఆలోచన కూడా రానివ్వకు’ అని జానకి చెప్తుంది. సత్య బాధగా ఏడుస్తూ ఉండటం చూసి ఏమైందని దేవుడమ్మ అడుగుతుంది. ఆదిత్య పిల్లల అవసరమే లేదు పిల్లల కోసం అమెరికా కాదు కదా ఎక్కడికి రాను దేవినే ముఖ్యం అని చెప్పిన విషయం సత్య ఏడుస్తూ చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకు వీడు ఇలా తయారవుతున్నాడు అని దేవుడమ్మ ఆలోచిస్తుంది.