హైదరాబాద్‌లోని హసన్ నగర్ లో దారుణం
నడిరోడ్డుపై బాబూఖాన్ అనే రౌడీ షీటర్ దారుణ హత్య
హోటల్ వద్ద కత్తులతో పొడిచి హత్య చేసిన దుండగులు
హుటాహుటిన అక్కడికి చేరుకున్న బహదూర్ పుర పోలీసులు
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
పాత కక్షల కారణంగానే హత్య జరిగిందా !
పలు ఆధారాలు స్వేకరించిన క్లూస్ టీమ్, కేసు నమోదు చేసిన పోలీసులు
Rowdy sheeter hacked to death in Hyderabad: హైదరాబాద్ : నగరంలో మరో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ రౌడీ షీటర్ దారుణహత్యకు గురయ్యాడు. హసన్ నగర్‌లో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ హోటల్ ముందు రౌడీ షీటర్ మునావర్ ఖాన్ అలియాస్ బాబూఖాన్ ను కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడిచేసి హత్య చేశారు. బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగింది. బుధవారం రాత్రి రౌడీ షీటర్ బాబూ ఖాన్ హత్య హైదరాబాద్ లో కలకలం రేపింది. గతంలోనూ నగరంలో కొందరు రౌడీ షీటర్లను వారి ప్రత్యర్థి గ్రూపులు, రియల్ ఎస్టేట్ వివాదాల్లో అవతలి వర్గం వారు కిడ్నాప్ చేసి చివరికి హత్య చేసిన ఘటనలు జరిగాయి.
అసలేం జరిగిందంటే..
మునావర్ ఖాన్ అలియాస్ బాబూ ఖాన్ వయసు 38 ఏళ్లు. అతడిపై ఇదివరకే పలు కేసులు నమోదయ్యాయి. రాజేంద్రనగర్ పరిధిలో రౌడీ షీట్ సైతం తెలిచినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి బాబూ బాన్ హసన్ నగర్ ఓ హాటల్ వద్ద ఉండగా.. కొందరు గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా రౌడీ షీటర్ పై కత్తులతో దాడి చేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులు, ఇతర పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో బాబూ ఖాన్ స్పాట్ లో మృతి చెందాడు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బహదూర్ పురా పోలీసులు పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే రౌడీ షీటర్ బాబూఖాన్ ను ప్రత్యర్థులు హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. రంగంలోకి దిగిన డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్ బృందాలు ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజీ సేకరించి నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.