అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. జీవితంలో ముందడుగు వేశారు. సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీ అయిపోయారు. అయితే... వాళ్ళిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు? అనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. గత ఏడాది అక్టోబర్‌లో తామిద్దరం వేరు పడుతున్నట్లు వాళ్ళిద్దరూ ప్రకటించారు. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విడాకుల ప్రశ్న ఎదుర్కోక తప్పడం లేదు. 


Nagarjuna On Samantha Naga Chaitanya Divorce : నాగ చైతన్య, సమంత విడాకులపై సౌత్ సినిమా ఇండస్ట్రీ, మీడియా కంటే హిందీ సినిమా పరిశ్రమ ప్రముఖులతో పాటు అక్కడ మీడియా జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. 'బ్రహ్మాస్త్ర' విజయం సాధించిన సందర్భంగా ముంబై మీడియా ముందుకు వెళ్లిన నాగార్జునకు కుమారుడి విడాకులపై ప్రశ్న ఎదురైంది. 


నాగ చైతన్య సినిమాల కంటే వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ చర్చ జరగడం తండ్రిగా మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుందా? అని నాగార్జునను ప్రశ్నించగా... ''తను (Akkineni Naga Chaitanya) సంతోషంగా ఉన్నాడు. నేను అది చూస్తున్నాను. నాకు అది చాలు'' అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు తాము ఆ విషయం (విడాకుల) గురించి ఆలోచించడం లేదని, తమ జీవితాల నుంచి అది వెళ్ళిపోయిందని, ప్రతి ఒక్కరి జీవితాల నుంచి వెళుతుందని ఆశిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. నాగ చైతన్య విడాకుల గురించి ఆలోచించడం మానేయమని పరోక్షంగా చెప్పారన్నమాట.


సమంతపై గౌరవం ఉందన్న చైతన్య
'లాల్ సింగ్ చడ్డా' విడుదల సమయంలో ముంబై వెళ్లిన నాగ చైతన్యకూ విడాకుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అప్పుడు ఆయన ''మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి గౌరవం ఉంది. మేం చెప్పాల్సింది చెప్పేశాం. ప్రతి ఒక్కరూ ఏదేదో అనుకుంటున్నారు కానీ... నిజంగా మా మధ్య ఏమీ లేదు. అవి చూసి నాకు బోర్ కొట్టింది'' అని పేర్కొన్నారు. సమంతతో వేరు పడిన తర్వాత తాను నటించిన సినిమాలు మూడు విడుదల అయ్యాయని, వాటి గురించి మానేసి విడాకుల విషయం అడుగుతున్నారని సున్నితంగా చురకలు అంటించారు.


Also Read : మా సినిమాను 'బాహుబలి', 'పొన్నియన్ సెల్వన్'తో కంపేర్ చేయడం లేదు!


ఇటీవల సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఫేస్‌బుక్‌లో కుమార్తె, మాజీ అల్లుడి గురించి ఒక పోస్ట్ చేశారు. అది చూస్తే... ఆయనకు నాగ చైతన్య మీద అభిమానం ఉన్నట్లు కనబడుతోందని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేశారు. ఆ సంగతి పక్కన పెడితే... చైతన్యను భర్త అని 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో కరణ్ జోహార్ ఏదో ప్రశ్నించబోగా, 'మాజీ భర్త' అని సమంత పేర్కొనడం కొంత మందికి నచ్చలేదు. ఆమె నిజమే చెప్పినప్పటికీ... ట్రోల్స్ వచ్చాయి. విడాకుల తర్వాత కూడా ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. గతంలో వాటికీ సమాధానం ఇచ్చారు. త్వరలో 'యశోద', 'శాకుంతల' సినిమా విడుదల కానున్నాయి. అప్పుడు సమంత మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో విడాకులపై ప్రశ్నలు ఎదురైతే ఏం చెబుతారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  


Also Read : బీజేపీ మద్దతుదారులు నన్ను ఎందుకు ద్వేషిస్తారు? - రష్మీ గౌతమ్