Polio Case In USA: దాదాపు అంతరించి పోయిందనుకుంటున్న పోలియో మళ్లీ పుట్టుకొస్తుంది. అమెరికాలో దాదాపు దశాబ్ద కాలం తర్వాత పోలియో కలకలం సృష్టిస్తోంది. పదేళ్ల తర్వాత తొలి కేసు నమోదైనట్లు అమెరికా గురువారం ప్రకటించింది. తొలి కేసు నమోదవడంతో అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
వ్యాక్సిన్ ఏమైంది?
రాక్‌లాండ్ కౌంటీకి చెందిన ఓ వ్యక్తికి పోలియో పాజిటివ్‌గా తేలినట్లు న్యూయార్క్ ఆరోగ్య విభాగం గురువారం వెల్లడించింది. అమెరికాలో చివరి సారిగా 2013లో పోలియో కేసు నమోదైంది. నోటి ద్వారా పోలియే వ్యాక్సిన్ (ఓపీవీ) తీసుకున్న వ్యక్తి నుంచి ఈ వైరస్ సోకినట్లు నిపుణులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలోనే నోటి ద్వారా వేసే వ్యాక్సిన్‌కు అమెరికా స్వస్తి పలికింది.
వారిపైనే
పోలియో అంతరించే స్థాయికి చేరుకుంది. ఈ వైరస్ ఎక్కువగా ఐదేళ్ల లోపు పిల్లలపైనే అధిక ప్రభావం చూపుతుంది. 1988 నుంచి కొత్త కేసులు 99 శాతం తగ్గాయి. అప్పటి నుంచి 125 దేశాలను పోలియో రహిత దేశంగా ప్రకటించారు. అయితే తాజాగా అమెరికాలో పోలియో కేసు నమోదు కావడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది.
Also Read: Monkeypox Cases India: దేశంలో మూడో మంకీపాక్స్ కేసు- మళ్లీ కేరళలోనే!
Also Read: ABP Network Cameraman Injured: అమృత్‌సర్ ఎన్‌కౌంటర్ కవర్ చేస్తుండగా ABP కెమెరామెన్‌కు బుల్లెట్ గాయం