ABP Network Cameraman Injured: అమృత్‌సర్ ఎన్‌కౌంటర్ కవర్ చేస్తుండగా ABP కెమెరామెన్‌కు బుల్లెట్ గాయం

ABP Desam   |  Murali Krishna   |  22 Jul 2022 03:37 PM (IST)

ABP Network Cameraman Injured: పంజాబ్‌ అమృత్‌సర్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్ కవర్ చేస్తుండా ABP నెట్‌వర్క్ కెమెరామెన్‌కు గాయాలయ్యాయి.

అమృత్‌సర్ ఎన్‌కౌంటర్ కవర్ చేస్తుండగా ABP కెమెరామెన్‌కు బుల్లెట్ గాయం

ABP Network Cameraman Injured: పంజాబ్ అమృత్‌సర్‌ సమీపంలో జులై 20న భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కాంగ్రెస్ నేత, సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యతో సంబంధమున్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లను పోలీసులు హతమార్చారు. ఈ ఎన్‌కౌంటర్‌ను కవర్ చేయడానికి వెళ్లిన ABP కెమెరామెన్‌కు గాయాలయ్యాయి.

సికందర్ మట్టు

ఇండియా-పాకిస్థాన్ సరిహద్దులోని భక్నా గ్రామంలో దాదాపు 5 గంటల పాటు ఈ ఎన్‌కౌంటర్ సాగింది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ను కవర్ చేసేందుకు అక్కడికి వెళ్లిన ABP నెట్‌వర్క్ కెమెరామెన్ సికిందర్ మట్టుకు బుల్లెట్ గాయమైంది. సికిందర్ కుడి మోకాలి కింద బుల్లెట్ తగిలింది. ఏకే-47 తుపాకీకి సంబంధించిన బుల్లెట్ పార్ట్ అతనికి తగిలింది.

గాయం తగిలిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి సికందర్‌ను అమృత్‌సర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సర్జరీ చేసి ఆ బుల్లెట్‌ను తొలిగించారు వైద్యులు.

ప్రాణాలకు తెగించి

ABP సాంజా సీనియర్ కరస్పాడెంట్ గగన్‌దీప్ శర్మ, కెమెరామెన్ సికందర్ మట్టు ప్రాణాలకు తెగించి ఈ ఎన్‌కౌంటర్‌ను కవర్ చేశారు. దాదాపు 3 గంటల పాటు ఎన్‌కౌంటర్‌ ప్లేస్ నుంచి వీళ్లు రిపోర్టింగ్ చేశారు. 

ఇతర మీడియా కన్నా ముందే మేం ఎన్‌కౌంటర్ స్పాట్‌కి చేరుకున్నాం. దాదాపు 3 గంటల పాటు మేం లైవ్ అందించాం. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సికందర్.. తాగడానికి నీళ్లు అడిగే సరికి నేను వెళ్లాను. అయితే నీళ్లు తాగిన కాసేపటికి తనకు రాయి తగిలి గాయమైందని సికందర్ చెప్పాడు. అయితే అది చూసి అనుమానం వచ్చి నేను అతడ్ని వాహనాల వెనక్కి లాగి అధికారులకు సమాచారం ఇచ్చాను.                                                - గగన్‌దీప్ శర్మ, ABP సాంజా సీనియర్ కరస్పాడెంట్

ఈ ఎన్‌కౌంటర్‌లో జగ్రూప్ సింగ్ రూపా, మన్‌ప్రీత్ సింగ్‌ అనే ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లు మృతి చెందారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో వీళ్లు వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్నారు.

Also Read: Punjab Encounter: పంజాబ్‌లో భారీ ఎన్‌కౌంటర్- సిద్ధూ మూసేవాలా హంతకులు మృతి

Also Read: African Swine Fever In Kerala: కేరళకు ఏమైంది? తాజాగా మరో వ్యాధి - 300 పందులను చంపేయాలని ఆదేశం!

Published at: 22 Jul 2022 03:31 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.