African Swine Fever In Kerala: కరోనా వైరస్, మంకీపాక్స్ వంటి వ్యాధులతో పోరాటం చేస్తోన్న భారత్‌లో తాజాగా మరో వ్యాధి కూడా వచ్చి చేరింది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌ను తాజాగా కేరళలో కూడా గుర్తించారు.
పందుల్లో
కేరళ వయనాడ్ జిల్లాలోని మనంతవాడి వద్ద రెండు పందుల పెంపక కేంద్రాల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు వెలుగుచూశాయి. ఒకే ఫాంలో ఎక్కువ పందులు చనిపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు శాంపిళ్లను టెస్టింగ్‌కు పంపించారు.
భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ఈ శాంపిల్స్‌ను పరీక్షించింది. పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు.
ఆదేశాలు
ఆఫ్రికన్ స్వైన్ వ్యాధి నిర్ధరణ కావడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఫాంలోని 300 పందులను చంపేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు పశు సంవర్ధకశాఖ అధికారులు తెలిపారు.
మరో 2 రాష్ట్రాలు
కేరళ కంటే ముందే అసోం, యూపీలలో కూడా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు గుర్తించినట్లు సమాచారం. అయితే అసోంలో పందులను చంపేందుకు పెంపకందారులు ముందుకు రావడం లేదని ఆ రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి తెలిపారు.
ప్రమాదకరమా?
- ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి.
- ఈ వ్యాధి పందులకు సోకడం వల్ల అవి మరణిస్తాయి.
- అయితే పందుల నుంచి మనుషులకు సోకే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
- ఈ వ్యాధికి ఇప్పటివరకు టీకా అందుబాటులోకి రాలేదు.
Also Read: Presidential Polls: విపక్షాల ఉమ్మడి కోటను బద్దలుగొట్టి ద్రౌపదికి క్రాస్ ఓటింగ్!
Also Read: Draupadi Murmu Profile: ద్రౌపది ముర్ము ఘనవిజయం- రాష్ట్రపతి పీఠంపై తొలి గిరిజన మహిళ