CBSE 12th Results: సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఈరోజు ఉధయం 11 గంటలకు సీబీఎస్ఈ బోర్డు ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ results.cbse.nic.in లేదా cbse.gov.in లో చూసుకోవచ్చని బోర్డు తెలిపింది. వీటితో పాటు డిజిలాకర్, పరీక్షా సంగమ్ నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ రూల్ నంబర్లు, స్కూల్ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు.
అమ్మాయిలదే పైచేయి.. అబ్బాయిలు అక్కడే!
మొత్తం 92.71 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని సీబీఎస్ఈ తెలిపింది. బాలురపై బాలికలు పైచేయి సాధించారు. బాలికల్లో 94.54 శాతం పాసవ్వగా.. బాలురలో ఇది 91.25 శాతంగా ఉంది. 33 వేల మందికి పైగా విద్యార్థులు 95 శాతం కంటే ఎక్కువ స్కోరు సాధించారని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. మొత్తం లక్షా 34 వేల మంది 90 శాతం కంటే అధికంగా మార్కులు పొందారని వివరించింది. ప్రాంతాల వారీగా అత్యధికంగా తిరువనంతపురంలో 98.83 శాతం, బెంగళూరులో 98.16 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది.
మార్కుల వెయిటేజీ ఇలా ఉంటుంది..
కరోనా మహమ్మారి నేపథ్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి బోర్డు ప్రత్యేక మదింపు విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అకాడమిక్ సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజించి టర్మ్ 1, టర్మ్ 2 పీరీక్షలు నిర్వహించారు. టర్మ్ 1 పరీక్షలను మల్టిపుల్ ఛాయిల్ నిధానంలో టర్మ్ 2 పరీక్షలను వ్యాసరూప, సంక్షిప్త సమాధాన ప్రశ్నల రూపంలో నిర్వహించారు. టర్మ్ 1 పరీక్షల నుంచి 30 శాతం మార్కుల వెయిటేజీ, టర్మ్ 2 పరీక్షల నుంచి 70 శాతం మార్కుల వెయిటేజీ కలిపి తుది ఫలితాలను విడదల చేసినట్లు బోర్డు వెల్లడించింది. అలాగే ఇందులో విద్యా సంవత్సరంలో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్ మెంట్ మార్కులు, ప్రాజెక్టు వర్క్స్, ప్రాక్టికల్ పరీక్షలు, ప్రీ బోర్డు పరీక్షల వివరాలతో కూడుకున్న స్కోరు కార్డు కూడా ఉంటుంది.
ఎంతమంది రాశారో తెలుసా?
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి 11, 12వ తరగతి టర్మ్ 2 రీభలు ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు జరిగిన విషయం అందరికీ తెలిిసిందే. వాటిలో 12వ తరగతి టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జూన్ 4 వరకు జరిగాయి. మొత్తం 35 లక్షల మందికి పైగా విద్యార్థులు 10, 12వ తరగతి పరీక్షలకు హాజరు అయ్యారు.