Punjab Encounter: పంజాబ్‌ కాంగ్రెస్ నేత, సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యతో సంబంధమున్న కీలక నిందితులను పోలీసులు మట్టుబెట్టారు. మృతులను జగ్రూప్ సింగ్ రూపా, మన్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించారు. అమృత్‌సర్‌ సమీపంలోని భక్నా గ్రామంలో నాలుగు గంటల పాటు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.






భారీ కాల్పులు


భక్నా గ్రామంలో దాదాపు నాలుగు గంటలపాటు ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. వార్త కవరేజికి వెళ్లిన వీడియో జర్నలిస్ట్ ఒకరికి గాయాలయ్యాయి. ఎన్‌కౌంటర్ జరుగుతున్నందున పోలీసులు భక్నా గ్రామంలో అనేక ఇళ్లను ఖాళీ చేయించారు. చుట్టుపక్కల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


ఘటనా స్థలం నుంచి ఏకే47, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇప్పటివరకూ మొత్తం 8 మంది షూటర్లను అరెస్ట్ చేశారు. 






ఇదీ జరిగింది


సిద్ధూ మూసేవాలా ఇద్దరు స్నేహితులతో కలిసి మే 29న మాన్సా జిల్లాలోని గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను తుపాకీతో కాల్చిచంపారు. ఈ ఘటనలో మిగతా ఇద్దరికీ గాయాలయ్యాయి. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. 


Also Read: AIADMK Tussle: తాళాలు కూడా పళనిస్వామికే- మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు


Also Read: Maharashtra Political News: ఠాక్రేకు సుప్రీంలో నిరాశ- శిందే వర్గానికి గడువు ఇచ్చిన కోర్టు