Smriti Irani Attacks on Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఫైర్ అయ్యారు. ఎన్నడూ పార్లమెంటులో గళం వినిపించని వ్యక్తి పార్లమెంటు కార్యకలాపాలను అగౌరవపరుస్తున్నారని రాహుల్‌పై మండిపడ్డారు.
రాహుల్ గాంధీ రాజకీయ చరిత్ర మొత్తం పార్లమెంటరీ విధానాన్ని, రాజ్యాంగబద్ధమైన సంస్థలను అగౌరవపరచడంతోనే నిండిపోయిందని స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ నిరసన
ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెరుగుదలకు వ్యతిరేకంగా పార్లమెంటులోని గాంధీ విగ్రహం ముందు ప్రతిపక్షాలు మంగళవారం నిరసన చేశాయి. రాహుల్ గాంధీ ఈ నిరసనల్లో పాల్గొన్నారు. గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి ప్రభుత్వం నిత్యావసర ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు.
Also Read: Sri Lanka New President: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే
Also Read: NEET Frisking Row: నీట్ ఫ్రిస్కింగ్ కేసులో ఐదుగురు మహిళలు అరెస్ట్- ఫ్యాక్ట్ చెక్ కమిటీ ఏర్పాటు