ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఫిరోజాబాద్​లో సొంత చెల్లినే వివాహం చేసుకున్నాడు ఓ అన్న. అయితే ఇక్కడో మరో ట్విస్ట్ ఏంటంటే.. అదీ ముఖ్యమంత్రి సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకోవడం.


ఏం జరిగింది?


టుండ్ల బ్లాక్​ పరిధిలో సీఎం సామూహిక వివాహల కార్యక్రమం జరిగింది. ఇందులో 51 జంటలు వివాహం చేసుకున్నాయి. వీరందరికీ పెళ్లి ఖర్చులను ప్రభుత్వమే భరించింది. గృహోపకరణాలు, దుస్తులను కానుకగా ఇచ్చింది. ఇందుకు ఆశ పడిన ఓ వ్యక్తి తన సొంత చెల్లిని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. అయితే అక్కడి వరకు అంతా బాగనే ఉన్నా.. విషయం బయటకు వచ్చేసింది.


Also Read: న్యూస్ Fact Check: 'అంతర్జాతీయ కోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ దల్వీర్ భండారీ'.. ఈ వైరల్ వార్తలో నిజమెంత?


ఫొటోల వల్ల..


ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో పెళ్లి చేసుకున్న జంటలకు ప్రభుత్వం దగ్గరుండి ఫొటోలు తీయించింది. అయితే ఆ వివాహ ఫొటోలు స్థానికంగా ప్రచారం కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ అన్న, చెల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది.


ప్రభుత్వం సీరియస్..


ఈ వ్యవహారంపై వార్తలు రావడంతో వివాహాలు నిర్వహించిన రాష్ట్ర సంక్షేమ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గ్రామస్థాయి అధికారులపై ఫైర్ అయ్యారు. దీనిపై వివరణ ఇవ్వాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. తప్పు చేసినవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మొత్తానికి ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి పొందడానికి ఏకంగా చెల్లినే పెళ్లి చేసుకున్నాడు ఆ అన్న.


Also Read: Kejriwal on Charanjit Channi: 'ప్రజలను బాత్రూంలో కలిసే ఏకైక సీఎం ఆయన మాత్రమే'


Also Read: Omicron Vaccine: ఒమిక్రాన్‌పై మన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? WHO షాకింగ్ న్యూస్!


Also Read: India New CDS: భారత నూతన COSCగా ముకుంద్ నరవాణే బాధ్యతల స్వీకరణ


Also Read: Central Cabinet: అమ్మాయి పెళ్లి వయసు 18 కాదు 21 ఏళ్లు.. త్వరలోనే పార్లమెంట్‌లో చట్టం


Also Read: Vijay Diwas 2021: భారత్‌ పంజా దెబ్బకు పాక్ పరార్.. విజయ్ దివస్.. ఇది కథ కాదు విజయగాథ!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి