1971లో పాకిస్థాన్‌పై చేసిన యుద్ధంలో భారత్ గెలిచిన దానికి గుర్తుగా భారతీయులు విజయ్ దివస్ జరుపుకుంటారు. ఆ యుద్ధం కారణంగా బంగ్లాదేశ్ దేశం పుట్టింది. ఇదే రోజును బంగ్లాదేశ్‌లో 'బిజోయ్ దిబోస్'గా జరుపుకుంటారు. ఆ యుద్ధంలో భారత జవాన్లు చూపిన తెగువ, ధైర్యసాహసాల గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. మరి ఆ యుద్ధంలో ఏం జరిగింది?
ఏం జరిగింది?
సరిగ్గా 50 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌పై ఆగ్రహావేశాలతో తూర్పు పాకిస్థాన్ (నేటి బంగ్లాదేశ్)లో స్వాతంత్య్ర పోరాటం మొదలైంది. అది కాస్త భారత్- పాక్ మధ్య యుద్ధానికి దారి తీసింది.
ఆ భీకర పోరులో భారత సైనికుల పోరాట పటిమ ముందు పాక్ జవాన్లు తేలిపోయారు. 13 రోజులు పాటు ఈ యుద్ధం జరిగింది. చివరకు భారత్ సైన్యం పాక్‌ను ఓడించి, బంగ్లాదేశ్ అవతరణకు కారణమైంది.
ఆ విజయానికి గుర్తుగా భారత్ ప్రతి ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్‌ను నిర్వహిస్తుంది.
13 రోజుల యుద్ధం
ఈ యుద్ధం కేవలం 13 రోజులే జరిగింది. చరిత్రలో అతి తక్కువ యుద్ధాలలో ఇది ఒకటి. భారతదేశం- పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణ 1971, డిసెంబర్ 3 నుంచి 1971, డిసెంబర్ 16 వరకు జరిగింది. యుద్ధంలో భారత్ గెలిచిన తర్వాత 93,000 మంది సైనికులను స్వాధీనం చేసుకుంది. బంగ్లాదేశ్‌లోని 75 మిలియన్ల ప్రజలకు స్వాతంత్ర్యం తెచ్చింది.
తూర్పు పాకిస్థాన్‌లోని బెంగాలీ జనాభాపై పాకిస్థాన్ చేసిన మారణహోమాన్ని అంతం చేయడానికి జరిగిన ఈ యుద్ధంలో 3000 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీనితో పాటు 8,000 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు. యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం సిద్ధించింది.
ప్రధాని ట్వీట్..
50వ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈరోజు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుందన్నారు.
Also Read: India New CDS: భారత నూతన COSCగా ముకుంద్ నరవాణే బాధ్యతల స్వీకరణ
Also Read: Central Cabinet: అమ్మాయి పెళ్లి వయసు 18 కాదు 21 ఏళ్లు.. త్వరలోనే పార్లమెంట్‌లో చట్టం
Also Read: Kamareddy: ఈ ఊర్లో లిక్కర్ అమ్మితే రూ.లక్ష, కొనాలంటే రూ.50 వేలు.. నాలుగేళ్ల నుంచి ఇంతే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి