మద్యం దుకాణాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఏటా కొత్త షాపులకు టెండర్లు వేస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. కానీ, ఈ గ్రామంలో మద్యం కొన్నా, విక్రయించినా, బెల్టు షాపులు నిర్వహించినా జరిమానా విధిస్తారు. కామారెడ్డి రెడ్డి జిల్లా బిక్నూర్ మండలం ఇసన్నపల్లి గ్రామంలో పూర్తిగా మద్య నిషేధాన్ని విధించారు గ్రామస్తులు. ఈ మేరకు గ్రామ పంచాయతీ తరఫున ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మద్యం విక్రయించోద్దని, ఏవరూ తాగవద్దని హుకూం జారీ చేశారు. మద్యం కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని భావించారు. గ్రామంలో మద్య నిషేదం అమలు చేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. అన్ని కులాలకు సంబంధించిన కుల పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఒక్కటై మద్యాన్ని ఏవరూ అమ్మవద్దని, బెల్టుషాపులు నిర్వహించకూడదని అనుకున్నారు. దీంతో గ్రామంలో విజయవంతంగా మద్య నిషేదం అమలు అవుతోంది.
మిగతా గ్రామాల్లో మాదిరిగానే ఇసన్నపల్లి గ్రామంలో మద్యం అమ్మకాలు జరిగేవి. పెద్దల నుంచి పిల్లల దాకా అంతా మద్యానికి బానిసలై తరచూ గొడవలు పడేవారు. ప్రశాంతంగా ఉండాలంటే మద్యపానం నిషేదమే మేలని భావించి వెంటనే నిర్ణయాన్ని అమలు చేశారు. నాలుగేళ్లుగా మద్యనిషేదాన్ని విధించటంతో గ్రామంలో ఎలాంటి గోడవలు, తగాదాలు లేవని చెబుతున్నారు గ్రామస్థులు. గ్రామంలోని బెల్టుషాపులు నిర్వహించినా, మద్యం విక్రయించినా, కొనుగోలు చేసినా జరిమానా విధిస్తామని గ్రామ పంచాయతీ తీర్మానించింది. ఎవరైనా మద్యం అమ్మితే వారికి రూ.లక్ష, కొన్న వారికి రూ.50 వేలు జరిమానా విధిస్తారు. మద్య నిషేధం వల్ల గ్రామంలో అనేక మార్పులు వచ్చాయి. యువత సన్మార్గంలో నడుస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు గ్రామస్థులు. మద్యంపై ఉక్కుపాదం మోపారు.
Also Read: Hyderabad Omicron: టోలిచౌకీలో ఒమిక్రాన్ హైఅలర్ట్.. కొనసాగుతున్న టెస్టులు, రంగంలోకి ప్రత్యేక టీమ్‌లు
ఇసన్న పల్లి గ్రామంలో నాలుగేళ్లుగా మద్యం షాపులు, బెల్టు షాపులను నిర్వహించకుండా కట్టడి చేశారు. గ్రామంలో అందరూ ఏకతాటిపై నిర్ణయం తీసుకోవటంతో ఇది సాధ్యమైందంటున్నారు గ్రామస్థులు. మద్యానికి బానిసై ఎన్నో కుటుంబాలు అనేక బాధలు అనుభవించారు. ఎప్పుడైతే మద్యానికి దూరంగా ఉన్నారో నాటి నుంచి గ్రామం రూపు రేఖలు కూడా మారిపోయాయంటున్నారు. క్రమ శిక్షణతో గ్రామ అభివృద్ధికి పాటు పడుతున్నారు.
మరోవైపు ఈ గ్రామంలో విద్యార్థులను ప్రైవేట్ స్కూల్‌కు పంపకుండా అందరూ ప్రభుత్వ పాఠశాలకే పంపుతున్నారు. గ్రామంలో ప్రభుత్వ బడిని సుందరంగా తీర్చిదిద్దుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్‌లో చదవరంటే అతిశయోక్తి కాదు. గ్రామంలోని ప్రజా ప్రతినిధులు పార్టీలకతీతంగా మంచి పనులకు ముందుకు వస్తున్నారు. ఇలా గ్రామం మొత్తం ఏకతాటిపై తీసుకున్న నిర్ణయంతో ఈ గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
Also Read: Hyderabad Drugs: ఓఆర్ఆర్ వద్ద ఇద్దరు యువకులు, యువతి.. ముగ్గురూ కలిసి కారులో.. అడ్డంగా బుక్
Also Read: Farmer Suicide: కన్నబిడ్డలా చూసుకున్న పంట ఒడిలోనే.. రైతు రవీందర్ ఆత్మహత్య..
Also Read: YS Sharmila: వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు.. త్వరలో పాదయాత్ర చేస్తా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి