భారత నూతన సీఓఎస్‌సీ (చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ)గా సైన్యాధిపతి జనరల్ ముకుంద్ నరవాణే బాధ్యతలు స్వీకరించారు. త్రివిధ దళాలను సంయుక్తంగా ముందుకు నడిపించేందుకు నరవాణేకు అవకాశం ఇచ్చింది రక్షణశాఖ.


తమిళనాడులో డిసెంబర్ 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ మరణించడంతో నరవాణేకు ఆ బాధ్యతలు అప్పగించారు.







సీనియర్..


ముగ్గురు త్రివిధ దళాల అధిపతుల్లో జనరల్ నరవాణే సీనియర్ కావడంతో ప్రభుత్వం ఆయన్ను నియమించింది. వాయుసేనాధిపతి చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ సెప్టెంబర్ 30న ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. నవంబర్ 30న చీఫ్ అడ్మిరల్ ఆ హరి కుమార్.. నావికా దళాధిపతిగా నియమితులయ్యారు.


చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్ట్ 2019లో ఏర్పాటు చేశారు. అయితే అంతకుముందు త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్ అయిన వారు సీఓఎస్‌సీకి ఛైర్మన్‌గా ఉండేవారు. సీడీఎస్‌ జనరల్ రావత్ మృతి చెందడంతో ఆ పోస్ట్ ఖాళీ అయింది. దీంతో నరవాణేను భర్తీ చేశారు.


స్వీకరించిన తర్వాత..


బాధ్యతలు స్వీకరించిన తర్వత జనరల్ నరవాణే.. ది కమాండర్ ఆఫ్ రాయల్ సౌదీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ లెఫ్టినెంట్ జనరల్ ఫహిద్ బిన్ అబ్దుల్లా అల్-ముతైర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.


నివాళులు అర్పించాక..


సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా ఆ ప్రమాదంలో మృతి చెందిన 11 మందికి మంగళవారం నరవాణే నివాళులర్పించారు. బుధవారం ఈ బాధ్యతలను చేపట్టారు నరవాణే.


ప్రమాదంలో..


డిసెంబర్​ 8న మధ్యాహ్నం తమిళనాడు సూలూర్​ ఎయిర్​బేస్​ నుంచి వెల్లింగ్టన్​లోని సైనిక కళాశాలకు సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా మరో 11 మంది ​అధికారులు వెళుతున్న క్రమంలో కూనూర్​ సమీపంలోని అటవీ ప్రాంతంలో హెలికాప్టర్​ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో రావత్​ దంపతులు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనను బెంగళూరు తరలించి చికిత్స అందించారు. అయితే మృత్యువుతో పోరాడి ఆయన కూడా నిన్న కన్నుమూశారు.


Also Read: Central Cabinet: అమ్మాయి పెళ్లి వయసు 18 కాదు 21 ఏళ్లు.. త్వరలోనే పార్లమెంట్‌లో చట్టం


Also Read: Kamareddy: ఈ ఊర్లో లిక్కర్ అమ్మితే రూ.లక్ష, కొనాలంటే రూ.50 వేలు.. నాలుగేళ్ల నుంచి ఇంతే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి