ABP  WhatsApp

Kejriwal on Charanjit Channi: 'ప్రజలను బాత్రూంలో కలిసే ఏకైక సీఎం ఆయన మాత్రమే'

ABP Desam Updated at: 16 Dec 2021 06:39 PM (IST)
Edited By: Murali Krishna

ప్రజలను బాత్రూంలో కలిసే ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాత్రమేనని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు

NEXT PREV

పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రపంచం మొత్తంలో ప్రజలను బాత్రూంలో కలిసే తొలి ముఖ్యమంత్రి చన్నీనే అంటూ విమర్శించారు.



ఓ ఇంటర్వ్యూలో పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. తాను ప్రజలను 24 గంటలు కలుస్తానని చెప్పారు. డ్రాయింగ్ రూం, హాల్, బాత్రూం ఇలా ఎక్కడైనా సరే కలుస్తాను అన్నారు. నాకు తెలిసి ప్రపంచంలో ప్రజలను బాత్రూంలో కలిసే సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాత్రమే.                                                             - అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం


పంజాబ్‌ ముక్త్‌సర్‌లో జరిగిన ఓ బహిరంగ ర్యాలీలో ఈ మేరకు మాట్లాడారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఆప్.. ప్రతిపక్షంగా ఉంది.


కాంగ్రెస్‌పైనే..


ఇటీవల కాంగ్రెస్‌పై విమర్శల దాడి పెంచారు కేజ్రీవాల్. ముఖ్యంగా పంజాబ్ కాంగ్రెస్‌పై పదునైన విమర్శలు చేస్తున్నారు. పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని.. అయితే ఆ చెత్త తమకు వద్దని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్.


వాగ్దానాలు..





పంజాబ్‌ విద్యారంగంలో సమూలమైన మార్పులు తెస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.




కాంట్రాక్ట్ టీచర్లను పర్మినెంట్ చేస్తామని, బదిలీలు పారదర్శకంగా చేస్తామని, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని కేజ్రీ వాగ్దానం చేశారు.


పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే.. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1000 రూపాయల చొప్పున ఇస్తామని.. అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.  


ఆప్‌దే..


పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో తేలింది. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 51 స్థానాల్లో విజయం సాదిస్తుందని సర్వేలో తేలింది.. కాంగ్రెస్ 31, అకాలీదళ్ 20 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. అయితే భాజపాకు ఒక్క స్థానం రావడం కూడా కష్టమేనని సర్వే వెల్లడించింది. 


Also Read: Omicron Vaccine: ఒమిక్రాన్‌పై మన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? WHO షాకింగ్ న్యూస్!


Also Read: India New CDS: భారత నూతన COSCగా ముకుంద్ నరవాణే బాధ్యతల స్వీకరణ


Also Read: Central Cabinet: అమ్మాయి పెళ్లి వయసు 18 కాదు 21 ఏళ్లు.. త్వరలోనే పార్లమెంట్‌లో చట్టం


Also Read: Vijay Diwas 2021: భారత్‌ పంజా దెబ్బకు పాక్ పరార్.. విజయ్ దివస్.. ఇది కథ కాదు విజయగాథ!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 16 Dec 2021 06:26 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.