భారత స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి తీవ్ర ఒడుదొడుకులకు లోనైన సూచీలకు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపులో మార్పులేమీ చేయకపోవడంతో మదుపర్లు ఊపిరిపీల్చుకున్నారు.
మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ క్రితం రోజు ముగింపు 57,788తో పోలిస్తే నేడు 58,243 వద్ద మొదలైంది. ఆరంభంలో ఒడుదొడుకుల మధ్య ట్రేడైంది. 57,683 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆపై కాస్త కోలుకొని 58,337 వద్ద గరిష్ఠాన్ని అందుకొని చివరకు 113 పాయింట్ల లాభంతో 57,901 వద్ద ముగిసింది.
క్రితం రోజు 17,221 వద్ద ముగిసిన నిఫ్టీ ఉదయం 17,373 వద్ద ఆరంభమైంది. 17,184 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకి 17,379 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 27 పాయింట్ల లాభంతో 17,248 వద్ద ముగిసింది.
బ్యాంకు నిఫ్టీ 204 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 37,092 వద్ద ఆరంభమైన సూచీ 37,159 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. ఆపై 36,385 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 36,548 వద్ద ముగిసింది.
నిఫ్టీలో 28 కంపెనీలు లాభాల్లో, 22 నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫీ, బీపీసీఎల్, విప్రో, రిలయన్స్ లాభపడ్డాయి. హిందాల్కో, సిప్లా, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్‌ను మినహాయిస్తే మిగతా రంగాల సూచీలన్నీ నష్టాల్లోనే ముగిశాయి.
Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?
Also Read: Multibagger Stocks: 5 ఏళ్లు.. 10 స్టాక్స్.. రూ.10 లక్షలు పెట్టుబడి.. రూ.1.7 కోట్ల లాభం
Also Read: Cars Price Increase: కొత్త సంవత్సరంలో ఈ కార్ల ధరలు పైకి.. ఈ సంవత్సరమే కొనేయండి!
Also Read: Gold-Silver Price: శుభవార్త.. నేడు భారీగా తగ్గిన బంగారం ధర, వెండి స్వల్పంగా.. ఇవాల్టి ధరలు ఇవీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి