శ్రీవిష్ణు (Sree Vishnu) కథానాయకుడిగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన సినిమా 'అర్జున ఫల్గుణ'. ఇందులో అమృతా అయ్యర్ (Amritha Aiyer) కథానాయిక. 'జోహార్' సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నతేజా మార్ని దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డిసెంబర్ 31న విడుదల చేస్తున్నట్టు (Arjun Phalguna Release Date)నేడు చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది. "అర్జునుడు సమరానికి సిద్ధం" అంటూ విడుదల తేదీ వెల్లడించింది.
Also Read: అర్జున ఫల్గుణ... ఎన్టీఆర్‌ అభిమానిగా శ్రీవిష్ణు
'అర్జున ఫల్గుణ' సినిమాలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR Jr) అభిమానిగా శ్రీవిష్ణు కనిపించనున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజ‌ర్‌లో ఎన్టీఆర్‌ బర్త్‌డేకి శ్రీవిష్ణు కటౌట్స్‌ కట్టినట్టు, 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా విడుదల అయిన థియేటర్ల ముందు హంగామా చేసినట్టు చూపించారు. టీజర్‌లో 'అరవింద సమేత...'లో ఎన్టీఆర్‌ సిక్స్‌ప్యాక్‌ కటౌట్‌ హైలైట్‌ అయింది. ఇక, ఆ టీజర్‌కు వస్తే... తన ప్రమేయం లేకుండా హీరో ఏదో సమస్యలో ఇరుకున్నట్టు అర్థమవుతోంది. 'నాది కాని కురుక్షేత్రంలో... నాకు తెలియని పద్యవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా... బలైపోవడానికి నేను అభిమన్యుడిని కాదు. అర్జునుడిని' అంటూ శ్రీవిష్ణు మీసం మీద చెయ్య వేసి చెప్పారు.

Continues below advertisement





నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, 'రంగస్థలం' మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ సంగీతం అందించారు. సుధీర్‌ వర్మ పి మాటలు రాశారు. ఎన్ఎమ్ పాషా సమర్పణలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.


Also Read: కర్ణాటకలో 'పుష్ప'ను బాయ్‌కాట్ చేస్తారా? సినిమాపై కన్నడిగులు ఎందుకు కోపంగా ఉన్నారు?
Also Read: ఇటు సునీల్... అటు హెబ్బా... విల‌న్‌గా అతడు!
Also Read: 'సంచారి'... 'రాధే శ్యామ్' నుంచి మరో వీడియో సాంగ్ వచ్చేసింది!
Also Read: 'లైగర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రౌడీ బాయ్! ప్రభాస్ సినిమా వెనుక...
Also Read: మరో కపూర్‌కు కరోనా...
Also Read: అక్క‌డ తెలుగు సినిమాలు చూడ‌టం 'ఆర్య‌'తో మొద‌లుపెట్టారట... అలాగే మీడియాకు సారీ
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి