ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. కేరళలో అతడి సినిమాలకు మంచి వసూళ్లు వస్తాయి. అల్లు అర్జున్ సినిమాలు మాత్రమే కాదు, ఈ మధ్య చాలా సినిమాలు తెలుగులో విడుదల అవుతున్నాయి. 'బాహుబలి: ద బిగినింగ్', 'బాహుబలి: ద కంక్లూజన్' సినిమాలు కేరళలోనూ భారీ విజయాలు అందుకున్నాయి. అయితే... కేరళలో తెలుగు సినిమాలు చూడటం 'ఆర్య'తో మొదలు అయ్యిందని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.
"కేరళలో నా క్రేజ్, కేరళలో తెలుగు సినిమాలు చూడటం నా సినిమా ఆర్యతో మొదలైంది. ఆ సినిమా నాకు ప్రేక్షకుల ఓ స్థానం కల్పించింది. ఆర్యకు పని చేసిన ముగ్గురం... నేను (హీరో), దేవి శ్రీ ప్రసాద్ (సంగీత దర్శకుడు), సుకుమార్ (దర్శకుడు) కలిసి చేసిన సినిమా పుష్ప. ఆర్య చేసినప్పుడు... 20 సినిమాలు చేసిన తర్వాత కేరళ వస్తే మళ్లీ అదే ప్రేమ లభిస్తుందని కలలోనూ ఊహించలేదు.కేరళలో నాకు లభిస్తున్న ఆదరణ వల్ల తెలుగు ప్రజలు నన్ను చూసే విధానం మారింది. మీ సినిమాల్లో నటించిన కారణంగా కేరళలో మమ్మల్ని గుర్తుపట్టారని చాలామంది తెలుగు ఆర్టిస్టులు నాకు చెప్పారు" అని 'పుష్ప' ప్రచార కార్యక్రమాల నిమిత్తం కేరళ వెళ్లిన అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.
బుధవారం సాయంత్రం కేరళ వెళ్లిన అల్లు అర్జున్, అంతకు ముందు బెంగళూరు వెళ్లారు. అయితే... అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రోగ్రామ్ స్టార్ట్ కావడంతో ఓ విలేకరి 'మీడియాను రెండు గంటలు వెయిట్ చేయించారు' అని అడిగారు. ఫాగ్ వల్ల ఫ్లయిట్ టేకాఫ్ అవ్వడం లేట్ అయ్యిందని, అక్కడి మీడియా జనాలకు సారీ చెప్పారు. సారీ చెప్పడం వల్ల మనిషి విలువ పెరుగుతుంది తప్ప తగ్గదని అన్నారు.
Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు సపోర్ట్‌గా మహిళా మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: ఎందుకీ తెల్లగెడ్డం రాజమౌళి? నాతో సినిమా ఎప్పుడు? - బాలకృష్ణ ప్రశ్న! మీసం తిప్పిన రాజమౌళి!
Also Read: సమంత 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్! ఆమె రోల్ ఏంటంటే?
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
Also Read: రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి