జనాభా లెక్కల్లో ఈ సారి ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు చెందిన కులాల జనాభాను కూడా లెక్కించాలని దేశవ్యాప్తంగా వస్తున్న డిమాండ్లను కేంద్రం తిరసేకరించింది.  వెనుకబడిన కులాల జనాభా గణనకు జనాభా లెక్కల సేకరణ సరైన సాధనం కాదని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన జనాభాను మినహా కులాలవారీగా జనాభా లెక్కలను సేకరించలేదని కేంద్రమంత్రి స్పష్టం చేసారు. 


Also Read : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఊరట.. ఇక ప్రతి శుక్రవారం ఆ అవసరం లేదు!


దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి ఓబీసీ జనగణన చేపట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు ప్రత్యేకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపుతున్నారు. ఢిల్లీలో బీసీ సంఘాలు ధర్నా కూడా చేశాయి. దీనికి అన్ని పార్టీల నేతలూ మద్దతిచ్చారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు ఓబీసీ జనగణన చేయడం సాధ్యం కాదని తేల్చేయడం ఆసక్తి రేపుతోంది. 


Also Read: Lakhimpur Kheri Case: 'మైక్ బంద్ కరో బే..' ABP రిపోర్టర్‌పై కేంద్ర మంత్రి ఫైర్.. వీడియో వైరల్


కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపి జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం షెడ్యూలును రూపొందిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో జనాభా సంఖ్యను లేదా ఏదైనా సామాజిక వర్గానికి సంబంధించిన జనాభాను లెక్కించడం నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఉద్దేశం కాదని మంత్రి స్పష్టం చేశారు. వర్గీకరణ అవసరాల కోసమే ఎన్‌ఎస్‌ఎస్‌ ఇంటింటి సర్వే చేపడుతుందని తెలిపారు.  


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదు, 247 మంది మృతి


ఓబీసీ కులగణన చేపట్టలేమని కేంద్రం చెప్పడం లేదు. అయితే జనాభా లెక్కల్లో భాగంగా చేపట్టడం సాధ్యం కాదని కేంద్రం చెబుతోంది. అయితే జనాభా లెక్కలతో పాటే ఆయా బలహీనవర్గాల ప్రజల్ని  గుర్తిస్తే సామాజిక న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని దేశవ్యాప్తంగా  అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం స్పందనపై ఓబీసీ జనగణనకు మద్దతిస్తున్న వారి స్పందన ఎలా ఉంటుందన్న దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తి ఏర్పడింది. 


Also Read: Captain Varun Singh Death: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదిశ్వాస వరకూ పోరాటమే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి