తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలపై చాలా రోజుల నుంచి గురి ఉంది. కానీ ఆయనకు సమయం, సందర్భం కలసి రావడం లేదు అంతే. గతంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు సంబంధం లేని ప్రాంతీయ పార్టీల మూడో కూటమి కోసం బహిరంగంగా ప్రకటించి మరీ పర్యటనలు చేశారు. ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలందరితో భేటీ అయ్యారు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల్లో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు కేసీఆర్ మళ్లీ అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ ఈ సారి ఆయన వ్యూహంలో స్పష్టమైన మార్పుకనిపిస్తోంది. అదేమిటంటే ఈ సారి ఎక్కడా బహిరంగ ప్రకటనలు చేయడం లేదు. అంతా గోప్యంగా చేసుకెళ్తున్నారు.
Also Read : తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ.. 2 కేసులు గుర్తింపు, మరో బాలుడికి కూడా.. డీహెచ్ వెల్లడి
స్టాలిన్‌తో జాతీయ రాజకీయాలపైనే ప్రధాన చర్చ !?
తమిళనాడు సీఎం స్టాలిన్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంతో సహా కలిశారు. ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. తమిళనాడు సీఎం ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి. డీఎంకే యూపీఏ కూటమిలో కీలక పార్టీ. డీఎంకేను ప్రాంతీయ పార్టీల కూటమిలోకి తెచ్చేలా కేసీఆర్ చర్చించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు ఆ కూటమిలోని పార్టీలతో కలిసి మూడో కూటమి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపైనే చర్చలు జరిపారని అంటున్నారు. కేసీఆర్ మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్‌తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే.. ధర్డ్ ఫ్రంట్‌లోకి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చని కొంత మంది క్లారిటీకి వస్తున్నారు.
Also Read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు నగదు
కేసీఆరే కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారా !?
ఇటీవల కేసీఆర్ కూడా కాంగ్రెస్‌తో కాస్త సన్నిహితంగా ఉంటున్నట్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరయింది. దాంతో కాంగ్రెస్ కు దగ్గరగా టీఆర్ఎస్ జరుగుతోందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో స్టాలిన్‌తో సమావేశం కావడం కూడా ఆ దిశగా ఓ ముందడుగు అని కొంత మంది విశ్లేషిస్తున్నారు. స్టాలిన్ కాంగ్రెస్‌ను వదులుకోరని.. కావాలంటే కాంగ్రెస్ కూటమిని బలపరిచేలా చేస్తారని అంటున్నారు. గతంలో జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కేసీఆర్‌ను గట్టిగా నమ్మే పరిస్థితి ఉండదని.. కానీ స్టాలిన్ లాంటి వాళ్లు చొరవ తీసుకుంటే ఆ గ్యాప్ ఫిల్ అవుతుందన్న అంచనాలో కేసీఆర్ ఉన్నారంటున్నారు.
ప్రశాంత్ కిషోర్ వ్యూహారమే ప్రకారమే పర్యటనలా ?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రశాంత్ కిషోర్ టీం సూచనలు, సలహాలు తీసుకుంటున్నారన్న ప్రచారం గుప్పుమంటోంది. ఢిల్లీ పర్యటనలో కేసీఆర్‌ను పీకే కలిశారని.. తర్వాత ఐ ప్యాక్ టీం వచ్చి ప్రగతిభ వన్‌లో కేసీఆర్‌తో భేటీ అయిందని తెలిసింది. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే మమతా బెనర్జీ పార్టీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ స్థానంలోతృ।ణమూల్‌ను ఉంచాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో పీకే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీల కూటమికి సిద్ధమవుతున్నారన్న అభిప్రాయం ఉంది. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రంలో ఎదురుపడవు. అందుకే ఈ కూటమి సాధ్యమన్న అభిప్రాయం ఆయా పార్టీల నేతల్లో ఉంది.
Also Read: యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి.. ,. స్టాలిన్‌ను ఆహ్వానించిన కేసీఆర్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి