"కేసీఆర్‌ తన మతపరమైన పర్యటనలను రాజకీయాలతో, రాజకీయ పర్యటనలను మతంతో కలిపేస్తున్నారని " టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆలయాల సందర్శన పేరుతో తమిళనాడు సీఎంను కలవడానికి వెళ్లారని... ఆరోపించారు. తన  పర్యటన రాజకీయ పరమైనదా, మత పరమైనదా అనేది కేసీఆర్‌ స్పష్టం చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారన్న టీఆర్ఎస్ నేతల ప్రకటనలను రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.  జాతీయ స్థాయిలో థర్డ్‌ ఫ్రంట్, ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి ఆలోచించే పరిస్థితిలో కేసీఆర్‌ లేరని... తెలంగాణలో తన సొంత పార్టీ భవిష్యత్తుపై కేసీఆర్‌ ఆందోళన చెందుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌లో అంతర్గత తిరుగుబాటు రావచ్చునని రేవంత్ జోస్యం చెప్పారు.  బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా చేసిన ఆలోచనే కేసీఆర్‌ ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌ విశ్లేషించారు.  


Also Read: ‘‘టీఆర్ఎస్’ అంటే తిరుగులేని రాజకీయ శక్తి..’ ఎమ్మెల్సీ రిజల్ట్స్‌పై ఫుల్ ఖుషీలో నేతలు, కేటీఆర్ కూడా
 
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు.   ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కారణమని ఆయన ఆరోపించారు. లక్షలాది మంది రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ కేసీఆర్‌ రాజకీయ, మతపరమైన పర్యటనల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు.   ప్రభుత్వం వరి సేకరణపై అనిశ్చితి, తదుపరి పంటపై స్పష్టత లేకపోవడంతో రైతాంగ పరిస్థితులు అధ్వాన్నంగా మారిందని మండిపడ్డారు. ఇటీవలి కాలంలో 206 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని  ..ఆర్థిక ఇబ్బందులతో పాటు, టీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాల వల్ల రైతులు తమ సాగును వదిలివేయడం వల్ల గాయం లాంటి పరిస్థితిలో ఉన్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.    


Also Read: యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి.. ,. స్టాలిన్‌ను ఆహ్వానించిన కేసీఆర్ !
 
తెలంగాణలో గత రెండు నెలల్లో ప్రతి ఎనిమిది గంటలకు కనీసం ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారని, రైతుల ఆత్మహత్యల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని రేవంత్‌ రెడ్డి అన్నారు. "రైతుల ఆత్మహత్యలపై కేసులు నమోదు చేయకుండా ఆపాలని పోలీసు అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు సమాచారం ఉందని లెక్కలను బయట పెట్టకుండా తెలంగాణలో ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’అనే  ప్రచారానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని రేవంత్ విమర్శించారు.   ఆత్మహత్య కేసు నమోదు చేస్తే రైతు బీమా కింద తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్థానిక అధికారులు, పోలీసులు బెదిరిస్తున్నారని అందుకే సహజ మరణాలుగా చూపిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.  


Also Read: క్యాంపులతో పట్టు నిలుపుకున్న టీఆర్ఎస్.. ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ !
 
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తప్పనిసరిగా రూ. ఆరు లక్షలు అందజేయాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. జీవో 421లోని నిబంధనల ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు.   రైతులందరూ ఆశలు కోల్పోవద్దని, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రైతుల హక్కుల కోసం పోరాడి న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. దేవాలయాలను సందర్శించడం ద్వారా చేసిన పాపాలు కడిగివేస్కోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. సమాజంలోని అన్ని వర్గాలను, ముఖ్యంగా రైతులను మోసం చేసిన కేసీఆర్‌ క్షమాపణలు చెప్పుకునేందుకు దేవాలయాలు తిరుగుతున్నారని విమర్శించారు. 


Also Read: ఆరోగ్య శ్రీ అమలులో నిర్లక్ష్యం వద్దు... వైద్య పరీక్షల్లో ఆలస్యం సహించబోం.. మంత్రి హరీశ్ రావు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి