తెలంగాణలో స్థానిక ప్రతాప్రతినిధుల కోటాలో జరిగిన 12 ఎమ్మెల్సీ సీట్లను టీఆర్ఎస్ గెల్చుకుంది. వాటిలో ఆరు ఏకగ్రీవం కాగా.... మరో ఆరింటికి ఎన్నికలు జరిగాయి. రాజకీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉండటంతో ఎవరికీ చాన్సివ్వకూడదన్న టీఆర్ఎస్ అవసరం లేకపోయినా క్యాంపులు పెట్టి పక్కాగా ఓట్లు పోల్ చేయించుకుంది. అయితే కొన్ని చోట్ల ఓటర్లు ధక్కరించడం... ఆ పార్టీకి మింగుడు పడని విషయమే. టీఆర్‌ఎస్ ఓట్లు క్రాస్ అయ్యాయా..? వేరే పార్టీల ఓట్లు టీఆర్ఎస్‌కు పడ్డాయా ? అన్న అంశంపై టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే విశ్లేషణ ప్రారంభించారు.
ఆదిలాబాద్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా దండె విఠల్ నిలబడ్డారు. ఆ జిల్లాలో టీఆర్ఎస్‌కు తిరుగులేని మెజార్టీ ఉంది. అందుకే ప్రధాన పార్టీపైన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టలేదు. కానీ ఆదివాసీల అభ్యర్థిగా ఇండిపెండెట్‌గా పుష్పరాణి నామినేషన్ వేయడంతో ఎన్నిక ఉత్కంఠగా మారింది. అయితే చివరికి టీఆర్ఎస్ మాత్రం పట్టు నిలుపుకుంది. ఆదిలాబాద్ లో మొత్తం స్థానిక ఓటర్లు 937 ఉండగా... వాటిలో టీఆర్ఎస్ ఓటర్లు 717 మంది. కానీ ఓట్లు మాత్రం 742 వచ్చాయి. అంటే టీఆర్ఎస్‌కే ఇతర పార్టీల వారు క్రాస్ ఓటింగ్ చేశారన్నమాట. ఇక్కడ టీఆర్ఎస్ వ్యూహం పక్కాగా అమలయింది. ఇండిపెండెంట్ పుష్పరాణికి 75 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
Also Read: TS MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. అన్ని స్థానాలు గులాబీ కైవసం
ఇక అందరి దృష్టి కరీంనగర్‌పైనే ఉంది. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ రెబల్‌గా సర్దార్ రవీందర్ సింగ్ పోటీలో ఉన్నారు. అదే సమయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ చోట టీఆర్ఎస్ ఓడిపోతుదంని జోస్యం చెబుతూ వస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ తమ ఓటర్లను చాలా పకడ్బందీగా క్యాంపులకు తరలించింది. ఆ వ్యూహం ఫలించింది. టీఆర్ఎస్‌కు మొత్తం 996 ఓట్లు ఉండగా.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు భానుప్రసాదరావు, ఎల్.రమణలకు కలిపి 1064 ఓట్లు వచ్చాయి, అంటే కరీంనగర్‌లోనూ ఇతర పార్టీల వారు కొంత మంది టీఆర్ఎస్‌కు ఓటు వేశారు .టీఆర్ఎస్ ఓటర్లు ఎవరూ ఇండిపెండెంట్ అభ్యర్థి రవీందర్ సింగ్ వైపు చూడలేదు. కానీ ప్రధాన పార్టీల ఓటర్లు మద్దతివ్వడంతో ఆయనకు 232 ఓట్లు వచ్చాయి.
Also Read: గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మధుసూదనాచారి.. తమిళిసై ఆమోదం
ఇక ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. హేమాహేమీలైన నేతలను కాదని తాతా మధు అనే కొత్త నేతకు టిక్కెట్ ఖరారు చేయడంతో పార్టీలో అసంతృప్తి కనిపించింది. పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కూడా కనిపించింది. ఆ ప్రభావం ఓటింగ్‌లో కనిపించింది., భారీగా కాంగ్రెస్ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగిది. ఖమ్మంలో టీఆర్ఎస్‌కు సీపీఐ కూడా మద్దతిచ్చింది. మొత్తం 768 ఓట్లు ఉండగా.. టీఆర్ఎస్‌వి 490. సీపీఐ మద్దతు ఇచ్చినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి తాతా మధుకు వచ్చింది 480 ఓట్లు మాత్రమే. కాంగ్రెస్ బలం 116 ఓట్లు మాత్రమే కాగా... 242 ఓట్లు పోలయ్యాయి. ఖమ్మం , కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి 140 టీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్‌కు క్రాస్ అయినట్లుగా ఆ పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
Also Read: Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ మూలాలు తెలుసా.. వాళ్లు నరరూప రాక్షసులుగా ఎందుకు మారారు?
ఇక సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ జిల్లాలోనూ టీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది. ఓట్లు క్రాస్ కాకుండా జాగ్రత్తపడింది. కాంగ్రెస్ పార్టీకి 230ఓట్ల బలం ఉంటే.. ఎనిమిది ఓట్లు ఎక్కువే వచ్చాయి. అయితే టీఆర్ఎస్ వారు కాక .. ఇతర పార్టీల వారు జగ్గారెడ్డి సతీమణికి ఓట్లు వేసినట్లుగా భావిస్తున్నారు. ఇక నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్‌కు కాస్త షాక్ తగిలింది. ఆ పార్టీకి మొత్తం ఓట్లు 991 ఉండగా వచ్చింది మాత్రం 971 మాత్రమే. దాదాపుగా ఇరవై మంది క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. అయితే ఓటింగ్‌లో అవగాహన లేకపోవడతో చెల్లని ఓట్లుగా నమోదయ్యాయని ఎవరూ క్రాస్ ఓటింగ్ చేయలేదని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: అబద్దాలతో బురిడీ కొట్టిస్తున్న శిల్పా చౌదరి - మరోసారి కస్టడీ కోరిన పోలీసులు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి