#MegaStarWithMegaFan: అఫీషియల్... దర్శకుడిగా మరో అభిమానికి అవకాశం ఇచ్చిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి మాంచి జోరు మీద ఉన్నారు. డిసెంబ‌ర్‌లో నాలుగు సినిమాల షూటింగులకు ఆయ‌న డేట్స్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త‌గా మ‌రో సినిమా అనౌన్స్ చేశారు.

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఓ సినిమా నిర్మించనున్నారు. 'ఛలో', 'భీష్మ' చిత్రాలతో విజయాలు అందుకున్న వెంకీ కుడుములు (Venky Kudumula) దీనికి దర్శకుడు. ఆయన చిరంజీవికి వీరాభిమాని. గతంలో పలు సందర్భాల్లో ఆ విషయం చెప్పారు. రామ్ చరణ్ 'జంజీర్' సినిమాలో ఓ సన్నివేశంలో కూడా వెంకీ కుడుముల కనిపించారు. ఇప్పుడు ఆ అభిమానికి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు చిరంజీవి. కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి వినబడుతోంది. ఈ రోజు (మంగళవారం, డిసెంబర్ 14) అధికారికంగా ప్రకటించారు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' వంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న చిత్ర‌మిది.

Continues below advertisement

చిరంజీవితో నిర్మిస్తున్న సినిమా గురించి నిర్మాత డీవీవీ దాన‌య్య మాట్లాడుతూ "మెగాస్టార్ చిరంజీవిగారితో సినిమా చేయాలనే కోరిక ప్రతి నిర్మాతకు ఉంటుంది. నాకూ ఆ కోరిక ఉంది. చిరంజీవిగారితో సినిమా చేయాలని నేనూ కోరుకున్నాను. నా బ‌ల‌మైన కోరిక‌కు మ‌రో బ‌లం... ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల రూపంలో తోడైంది. అతడు మెగాస్టార్ వీరాభిమాని. చిరంజీవితో సినిమా చేయాల‌నేది ఆయ‌న డ్రీమ్‌. వెంకీ కుడుముల చెప్పిన కథ చిరంజీవిగారికి న‌చ్చింది. మెగాభిమానుల‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే క‌మ‌ర్షియ‌ల్ చిత్రమిది. ఈ సినిమాలో నటించబోయే ఇత‌ర న‌టీన‌టులు, సినిమాకు పని చేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం" అని అన్నారు. 

Also Read: ఎవడాడు? దిగొచ్చాడా?... రానాకు 'భీమ్లా నాయక్' టీమ్ ఇచ్చిన బ‌ర్త్‌డే గిఫ్ట్ చూశారా?
Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో
Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది
Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?
Also Read: నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగార్రాజు... మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు?
Also Read: తూరుపు కొండలు వెలిగిద్దాం... విప్లవ గీతం వినిపిద్దాం! - రవన్న పాత్రలో రానా విప్లవ గళం విన్నారా?
Also Read: అమెరికాలో బాలకృష్ణ క్రేజ్ అన్‌స్టాప‌బుల్‌... మరో రికార్డ్ క్రియేట్ చేసిన 'అఖండ'
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Continues below advertisement
Sponsored Links by Taboola