బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో వీరి పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారింది. పెళ్లయ్యే వరకు ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన ఈ జంట ఆ తరువాత సోషల్ మీడియాలో వరుసగా ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఈ ఫొటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. మెహందీ, హల్దీ, వెడ్డింగ్ ఇలా ప్రతి ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది ఈ జంట. 


రాజస్థాన్ లోని కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో విక్కీ-కౌశల్ ల వివాహం జరిగింది. దీనికి బాలీవుడ్ నుంచి ఎవరెవరు హాజరయ్యారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ ప్రముఖుల నుంచి మాత్రం ఈ జంటకు ఖరీదైన బహుమతులు అందినట్లు తెలుస్తోంది. వీరిలో కత్రినా మాజీ ప్రియులు రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 


కత్రినా పెళ్లి సందర్భంగా రణబీర్ కపూర్ రూ.2.7 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్‌ బహుమతిగా ఇవ్వగా.. సల్మాన్ ఖాన్ రూ.3 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చారట. సల్మాన్, రణబీర్ లతో పాటు అలియా భట్ లక్ష రూపాయలు విలువైన పెర్ఫ్యూమ్ బాస్కెట్ ను కత్రినాకు బహుమతిగా ఇచ్చిందని తెలుస్తోంది. అలానే అనుష్కశర్మ-విరాట్ కోహ్లీ రూ.6.4 లక్షల విలువైన డైమండ్ ఇయరింగ్స్ ను గిఫ్ట్ గా పంపించారట. షారుఖ్ ఖాన్ లక్షన్నర విలువ చేసే పెయింటింగ్ ను ఇవ్వగా.. హృతిక్ రోషన్ మూడు లక్షల విలువ చేసే బీఎండబ్య్లూ కంపెనీకి చెందిన బైక్ ను విక్కీ కౌశల్ కి ఇచ్చారట. వీరితో పాటు తాప్సీ కూడా ఓ ప్లాటినం బ్రేస్ లెట్ ను గిఫ్ట్ గా ఇచ్చిందట. 






Also Read:'పుష్ప' ఐటెం సాంగ్.. సమంత ఎంత తీసుకుందంటే..


Also Read: గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే..?


Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో


Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది


Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి