పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న సినిమా 'భీమ్లా నాయక్' (Bheemla Nayak). సాగర్ కె. చంద్ర దర్శకుడు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ (Trivikram Srinivas) స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించడంతో పాటు 'లా లా... భీమ్లా' సాంగ్ కూడా రాసిన ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ రోజు (మంగళవారం, డిసెంబర్ 14) రానా పుట్టినరోజు సందర్భంగా 'స్వాగ్ ఆఫ్ డేనియల్ శేఖర్' (Swag of Daniel Shekar) పేరుతో ఓ టీజర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి.


'వాడు అరిస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా అరవగలను. ఎవడాడు? దీనమ్మా... దిగొచ్చాడా? ఆఫ్ట్రాల్ ఎస్సై. సస్పెండెడ్' అని రానా డైలాగ్ చెప్పారు. డేనియల్ శేఖర్ పాత్రలో ఆవేశం చూపించారు. ఈ టీజ‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా క‌నిపించారు.





రానా (Rana Daggubati) పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌లో మరోసారి జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదల కాదని, వాయిదా పడుతుందని బలమైన ప్రచారం జరుగుతోంది. నిర్మాత నాగవంశీ సహా యూనిట్ సభ్యులు ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ వస్తున్నారు. 


Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో
Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది
Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?
Also Read: నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగార్రాజు... మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు?
Also Read: తూరుపు కొండలు వెలిగిద్దాం... విప్లవ గీతం వినిపిద్దాం! - రవన్న పాత్రలో రానా విప్లవ గళం విన్నారా?
Also Read: అమెరికాలో బాలకృష్ణ క్రేజ్ అన్‌స్టాప‌బుల్‌... మరో రికార్డ్ క్రియేట్ చేసిన 'అఖండ'
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి