హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి వరాల జల్లులు కురిపించారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. ఉస్మానియాలో నూతనంగా నిర్మించిన అధునాతన సిటీ స్కాన్, క్యాధ్ ల్యాబ్ ను ప్రారంభిచారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఉస్మానియాలో శానిటేషన్ సరిగా లేదని, కాంట్రాక్ట్ సంస్థ పనితీరు బాగోలేదని, త్వరలో శానిటేషన్ కు కొత్త టెండర్లు పిలుస్తామని తెలిపారు. నెలకు వెయ్యికి పైగా పోస్టుమార్టమ్స్ జరుగుతున్న ఉస్మానియాలో మార్చురీ సరిగా లేదని మంత్రి అన్నారు. ఐదు కోట్లతో అత్యాధునిక మార్చురీని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. రూ.2.15 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ ను హరీశ్ రావు ప్రారంభించారు. 


Also Read: యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి.. ,. స్టాలిన్‌ను ఆహ్వానించిన కేసీఆర్ !


24 గంటల్లో రిపోర్ట్స్ వచ్చేలా చర్యలు


ఇప్పటికే ఆసుపత్రిలో రెండు సిటీ స్కాన్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, అయితే వాటిలో ఒకటి రిపేర్ లో ఉందని, త్వరలో రిపేర్ చేయించి అందుబాటులోకి తెస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఉస్మానియాలో క్యాథ్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి, తెలంగాణాలో ఐదు ప్రధాన ఆసుపత్రుల్లో క్యాథ్ ల్యాబ్స్ అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్న రోగులకు వైద్య పరీక్షలు ఆలస్యం జరుగుతున్నాయని, ఇకపై అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో నిర్వహించే పరీక్షలకు ఇరవై నాలుగు గంటలు గడిచేలోపే రిపోర్ట్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. 


Also Read: క్యాంపులతో పట్టు నిలుపుకున్న టీఆర్ఎస్.. ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ !


ఆరోగ్య శ్రీ అమలులో నిర్లక్ష్యం వద్దు


ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది, అధికారులతో సమీక్షించిన మంత్రి త్వరలో యాభై పడకలతో ఐసీయూ అందుబాటులో తెస్తామన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భవ పథకాల అమలులో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోన్నారు.  ఉస్మానియాలో ఫైర్ ఫైయిటింగ్ పరికరాలను త్వరలో అందుబాటులోకి తేనున్నామని తెలిపారు. ఉస్మానియా బిల్డింగ్ వివాదం కోర్టు పరిధిలో ఉన్న కారణంగా బిల్డింగ్ విషయంలో ఏంచేయలేని పరిస్థితి ఉందన్నారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకుంటారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు


Also Read: ‘‘టీఆర్ఎస్’ అంటే తిరుగులేని రాజకీయ శక్తి..’ ఎమ్మెల్సీ రిజల్ట్స్‌పై ఫుల్ ఖుషీలో నేతలు, కేటీఆర్ కూడా


Also Read: TS MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. అన్ని స్థానాలు గులాబీ కైవసం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి