హిందీ సినిమా ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఒకరి తర్వాత మరొకరు కరోనా బారిన పడుతున్నారు. కరీనా కపూర్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా తానకు కరోనా సోకినట్టు స్టార్ కిడ్ షనయా కపూర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నాలుగు రోజుల క్రితం టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చిందని, మళ్లీ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బావుందని, స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని ఆమె చెప్పారు. తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోమని షనయా కపూర్ కోరారు.
ప్రముఖ హిందీ దర్శక - నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో 'కభీ ఖుషి కభీ గమ్' సినిమా విడుదలై రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా జరిగిన పార్టీకి హాజరైన తర్వాత కరీనాకు కరోనా సోకింది. అదే పార్టీకి షనయా తల్లి మహీప్ కపూర్ కూడా హాజరయ్యారు. ఆమె కూడా కరోనా సోకింది. ఆమె నుంచి షనయాకు కరోనా సోకి ఉంటుందని ఊహిస్తున్నారు. కరణ్ జోహార్ ఇంట్లో పార్టీకి హాజరైన కరీనా కపూర్, అమృతా అరోరా, సీమా ఖాన్, మహీప్ కపూర్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు మహీప్ కుమార్తె కూడా కరోనా బారిన పడ్డారు. ఆల్రెడీ పార్టీ ఇచ్చిన కరణ్ జోహార్‌పై విమర్శల జడివాన మొదలైంది. తమ ఇంట్లో ఎనిమిది మంది మాత్రమే కలిశామని, దాన్ని పార్టీ అనరని, తమ ఇంట్లో కొవిడ్ ప్రొటొకాల్స్ పాటించమని కరణ్ జోహార్ వివరణ ఇచ్చారు. తమ కుటుంబ సభ్యులు అందరూ ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేయించుకోగా నెగెటివ్ రిజల్ట్స్ వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్, మరో దర్శకుడు మహేష్ భట్ కుమార్తె ఆలియా భట్, అనన్యా పాండే తదితరులను హిందీ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన కరణ్ జోహార్, త్వరలో షనయా కపూర్‌ను పరిచయం చేస్తూ ఓ సినిమా నిర్మించనున్నారని బాలీవుడ్ ఖబర్.
Also Read: అక్కడ తెలుగు సినిమాలు చూడటం 'ఆర్య'తో మొదలుపెట్టారట... అలాగే మీడియాకు సారీ
Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు సపోర్ట్‌గా మహిళా మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి