Parampara: చావడం కంటే చంపడం కష్టం... హాట్‌స్టార్ తెలుగు సిరీస్ ట్రైలర్ వచ్చేసింది!

జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో రూపొందిన వెబ్ సిరీస్ పరంపర ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు.

Continues below advertisement

డిస్నీప్లస్ హాట్‌స్టార్ కొత్త తెలుగు వెబ్ సిరీస్ ‘పరంపర’ ట్రైలర్‌ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఇందులో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ రూపొందినట్లు ట్రైలర్ చూసి చెప్పవచ్చు.

Continues below advertisement

‘నన్నడిగితే చావడం కన్నా చంపడం కష్టం.’ అనే నవీన్ చంద్ర మాటలతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.  ‘నాయుడు కింగ్ మేకర్.. అంటే కింగ్ కన్నా గొప్పవాడు’ లాంటి డైలాగ్‌తో శరత్‌కుమార్ క్యారెక్టర్ ఎలా ఉండనుందో చెప్పేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు. డిసెంబర్ 24వ తేదీ నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది.

ఈ సిరీస్‌లో ఆకాంక్ష సింగ్, రోగ్ ఫేం ఇషాన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. నగేష్ కుమరన్ ఈ సిరీస్‌కు సంగీతం అందించారు. హరి ఏలేటి, ఎల్.కృష్ణ విజయ్ మాటలు రచించారు. ఎస్వీ విశ్వేశ్వర్ కెమెరా బాధ్యతలు నిర్వర్తించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ చేశారు.

డిస్నీప్లస్ హాట్‌స్టార్‌కు ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. దీంతో ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ పరంపర సిరీస్‌ను తెరకెక్కించినట్లు దర్శకుడు ఎల్. కృష్ణ విజయ్ తెలిపారు.

Also Read: సమంత 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్! ఆమె రోల్ ఏంటంటే?
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్

Also Read: Vijay Devarakonda: పుష్ఫ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నానంటే... రౌడీ హీరో ట్వీట్, సమాధానమిచ్చిన అల్లు అర్జున్
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
Also Read: కొంత మంది వెనక్కి తగ్గారు.. కానీ అఖండతో మేం డేర్ స్టెప్ వేశాం: టిక్కెట్ల విధానంపై బాలయ్య
Also Read: రాజమౌళి డైరెక్ష‌న్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్! 

Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు స‌పోర్ట్‌గా మ‌హిళా  మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Continues below advertisement