తెలుగుదేశం పార్టీ హయాంలో విదేశాల్లో విద్య కోసం సాయం అందుకున్న విద్యార్థులకు ఇప్పుడు ఎలాంటి సాయం అందడంలేదు. వారి చదువులు మధ్యలో ఉన్నాయి. పిల్లలు విదేశాల్లో ఉన్నారు. వారికి ప్రభుత్వం సాయం నిలిపివేయడంతో.. తమ పిల్లల చదువులకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చడానికి ఆ తల్లిదండ్రులు కష్టాలు పడుతున్నారు. పిల్లల చదువులు మధ్యలో ఆగిపోతాయాన్న ఆవేదనతో తమ సమస్యను చెప్పుకునేందుకు సీఎం జగన్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు.
‘విదేశీ విద్యాదరణ పథకాని’కి విద్యార్థులను ఎంపిక చేసింది. ఒక్కొక్కరికి రూ. పది లక్షల వరకూ సాయం అందేది. వైఎస్ఆర్‌సీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఆపేశారు.కడప జిల్లాకు చెందిన విదేశీ విద్యకు సాయం పొందిన తల్లిదండ్రులు అందరూ కలిసి పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందుగా ఇడుపులపాయ లో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. సమాధికి.., ఘాట్‌లో ఉన్న విగ్రహానికి తమ ఆవేదన తెలుపుతూ వినతి త్రం ఇచ్చారు. తర్వాత కొద్ది సేపు మౌనం పాటించారు. అనంతరం వైఎస్సార్ ఘాట్ నుంచి వారు పాదయాత్రగా తాడేపల్లికి బయలుదేరారు.
Also Read: సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ తర్వాత పీఆర్సీపై ప్రకటన... ఉద్యోగులు ఆందోళనను వాయిదా వేసుకోవాలి
అయితే విషయం తెలుసుకున్న ఇడుపుల పాయ ఆర్కే వ్యాలీ పోలీసులు హుటాహుటిన వైఎస్ఆర్ ఘఆట్ వద్దకు వచ్చారు. పాదయాత్రను నిలుపుదల చేశారు. పాదయాత్రకు అనుమతి లేని కారణంగా ఆపేయాలని సూచించారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికే పాదయాత్ర చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్ఐ వద్ద వాపోయారు. అయితే అనుమతి ఉంటేనే పాదయాత్రగా వెళ్లాలని లేకపోతే పాదయాత్ర గా వెళ్ళడానికి వీలు లేదని పోలీసులుస్పష్టం చేశారు. పాదయాత్ర చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను అడ్డుకుని ఆటో ఎక్కి పంపించారు.
Also Read:సంక్రాంతికి వచ్చినా.. ఉగాదికి వచ్చిన కండువా వేయాల్సింది నేనేనంటూ పరిటాల శ్రీరాం హాట్ కామెంట్స్
ప్రభుత్వం తమ పిల్లల విదేశీ విద్యకు చేయాల్సిన సాయాన్ని వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు శాంతియుతంగా చేపడుతున్న పాదయాత్ర ను పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ఎవరికి చెప్పుకున్నా సమస్య పరిష్కారం కావడం లేదని... ముఖ్యమంత్రే స్పందించాలని కోరారు.
Also Read: అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి