Cryptocurrency Prices Today, 16 December 2021: క్రిప్టో మార్కెట్లలో గురువారం కొనుగోళ్లు సాధారణంగానే ఉన్నాయి. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 0.68 శాతం పెరిగి రూ.38.94 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ 4.02 శాతం తగ్గి రూ.3,22,200 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.36 లక్షల కోట్లుగా ఉంది.


బైనాన్స్‌ కాయిన్‌ 0.85 శాతం పెరిగి రూ.42,749, టెథెర్‌ 0.09 శాతం పెరిగి రూ.79.93, సొలానా 8.86 శాతం పెరిగి రూ.14,491, కర్డానో 3.58 శాతం పెరిగి రూ.105, యూఎస్‌డీ కాయిన్‌ 0.06 శాతం పెరిగి రూ.79.89 వద్ద కొనసాగుతున్నాయి. స్టార్జ్‌, ఎల్‌రాండ్‌, అవలాంచె, పవర్లెడ్జ్‌, లైవ్‌పూర్‌, గోలెమ్‌, బేసిక్‌ అటెన్షన్‌ 10 నుంచి 15 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. ఈఓఎస్‌, గాలా, సుషి, యూనిస్వాప్‌, డోజీకాయిన్‌ స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.


హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.


క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.


భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.


Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?


Also Read: Digital Payment Incentive: ఈ డెబిట్‌ కార్డుతో చెల్లింపులు చేస్తే రూ.1300 కోట్ల బహుమతులు.. కేబినెట్‌ ఆమోదం!


Also Read: Multibagger Stocks: 5 ఏళ్లు.. 10 స్టాక్స్‌.. రూ.10 లక్షలు పెట్టుబడి.. రూ.1.7 కోట్ల లాభం


Also Read: Cars Price Increase: కొత్త సంవత్సరంలో ఈ కార్ల ధరలు పైకి.. ఈ సంవత్సరమే కొనేయండి!


Also Read: Gold-Silver Price: శుభవార్త.. నేడు భారీగా తగ్గిన బంగారం ధర, వెండి స్వల్పంగా.. ఇవాల్టి ధరలు ఇవీ..


Also Read: Petrol-Diesel Price, 16 December: వాహనదారులకు షాక్! ఈ నగరాల్లో ఎగబాకిన పెట్రో, డీజిల్ ధర.. ఇక్కడ మాత్రం స్థిరం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి