ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే 40 శాతం టికెట్లు మహిళలకు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే తాము అధికారంలోకి వస్తే బాలికలకు స్మార్ట్ ఫోన్లు, యువతులకు స్కూటర్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
హామీల వర్షం..
యూపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 12వ తరగతి విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యుయేషన్ చేస్తోన్న యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 శాతం టికెట్లు మహిళలకే ఇస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ మేరకు ప్రకటించారు.
తమ కుటుంబ సంక్షేమం కోసం మహిళలు స్వయంగా అభివృద్ధి బాధ్యత తీసుకోవాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో మహిళలు చురుగ్గా పాల్గొనాలన్నారు. 'నేను మహిళలు, నేను పోరాడగలను' అనే నినాదాన్ని ప్రియాంక ఇచ్చారు. మహిళలు మార్పును కోరుకుంటే తమతో కలిసిరావాలని సమాజంలో లింగ సమానత్వాన్ని చాటాలన్నారు.
Also Read: 100 Crore Vaccinations: 'ఇక తగ్గేదేలే.. నవ చరిత్రను లిఖించాం.. 100 కోట్ల మార్క్‌పై మోదీ ప్రశంసలు'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి